`బాహుబలి 2` రికార్డులు బ్రేక్‌.. `పఠాన్‌` సరికొత్త రికార్డ్‌..

Published : Mar 04, 2023, 11:19 PM IST
`బాహుబలి 2` రికార్డులు బ్రేక్‌.. `పఠాన్‌` సరికొత్త రికార్డ్‌..

సారాంశం

ప్రభాస్‌ నటించిన `బాహుబలి 2` రికార్డులను బ్రేక్‌ చేసింది `పఠాన్‌`. షారూఖ్‌ ఖాన్‌ నటించిన ఈ సినిమా సరికొత్త రికార్డుని క్రియేట్‌ చేసింది. ఆ రికార్డుల విశేషాలను చూస్తే.. 

ప్రభాస్‌ నటించిన సంచలన చిత్రం `బాహుబలి`. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు రానా ముఖ్య పాత్ర పోషించారు. అనుష్క, తమన్నా కథానాయికలుగా, సత్యరాజ్‌, రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన రెండో భాగం `బాహుబలి 2` సంచలన విజయం సాధించింది. ఇండియన్‌ సినిమాలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.1800కోట్లు వసూలు చేసింది. ప్రపంచం ముందు ఇండియన్‌ సినిమా సత్తాని ముఖ్యంగా, తెలుగు సినిమా పవర్‌ని చూపించారు. 

ఇండియాలో ఈ సినిమా 1050కోట్లు వసూలు చేయగా, హిందీ వర్షన్‌ 510 కోట్లు రాబట్టింది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమా రికార్డులను మరే మూవీ బ్రేక్‌ చేయలేదు. తాజాగా హిందీ మూవీ `పఠాన్‌` ఈ రికార్డులను బ్రేక్‌ చేసింది. ఈ చిత్రం హిందీ వర్షన్‌ `బాహుబలి2`ని దాటేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ.511కోట్లు వసూలు చేసింది. కేవలం హిందీ వర్షన్‌లో మాత్రమే `బాహుబలి 2` రికార్డులను బ్రేక్‌ చేసింది. దీంతో హిందీ వెర్షన్‌ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది `పఠాన్‌.

ఇక ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్లు చూస్తే, ఇప్పటి వరకు ఈ సినిమా వెయ్యి కోట్లు వసూలు చేసింది. దీంతో `బాహుబలి2`, `దంగల్‌`, `కేజీఎఫ్‌2`, `ఆర్‌ఆర్‌ఆర్‌` తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికీ ఇది థియేటర్లలో రన్‌ అవుతుండటం విశేషం. మామూలు అంచనాలతో వచ్చిన ఈ సినిమా వెయ్యి కోట్లకు రీచ్‌ కావడం సంచలనంగా చెప్పొచ్చు. కరోనాతో కుదీల పడ్డ బాలీవుడ్‌కి ఊపిరి పోసింది. ఆక్సిజన్‌ అందించింది. 

షారూఖ్‌ ఖాన్‌ హీరోగా నటించిన `పఠాన్‌`లో దీపికా పదుకొనె కథానాయికగా నటించగా, సల్మాన్‌ ఖాన్‌ గెస్ట్ రోల్‌ చేశారు. యాక్షన్‌ ఎంటర్ టైనర్‌గా సిద్ధార్థ్‌ ఆనంద్‌ రూపొందించిన ఈ సినిమా జనవరి 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు