ఫ్యాన్స్ కు మెగా ట్రీట్.. భోళా మేనియా లిరికల్ వీడియో వచ్చేసింది.. బాస్ స్టెప్పులకు రచ్చే

By Asianet News  |  First Published Jun 4, 2023, 5:30 PM IST

మెగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్ అందింది. ‘భోళా శంకర్’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలై ఆకట్టుకుంటోంది. వింటేజ్ లుక్ లో చిరు దుమ్ములేపారు. ‘భోళా మేనియా’కు మంచి రెస్పాన్స్ దక్కుతోంది.
 


మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘భోళా శంకర్’. చిరంజీవి నయా లుక్ తో ఈ మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కొద్దిరోజుల్లో షూటింగ్ పార్ట్ కూడా పూర్తి కానుంది. ఈ సందర్బంగా ప్రమోషన్స్ కూడా యూనిట్ ప్రారంభించింది. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. 

ఈ క్రమంలో Bholaa Shankar  నుంచి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేశారు. Bholaa Mania పేరిట విడుదలైన లిరికల్ వీడియో ఆకట్టుకుంటోంది. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి ట్రెండీ లిరిక్స్ అందించారు. బాస్ క్రేజ్ కు తగట్టుగా లిరిక్స్ రాశారు. మహతీ స్వర సాగర్ మరియు రేవంత్ ఎల్వీ అద్భుతంగా పాడారు. ఈ సాంగ్ కు మ్యూజిక్ డైరెక్టర్ మహాతి స్వర సాగర్ క్యాచీ ట్యూన్ ను అందించారు. మొత్తానికి సాంగ్ మెగా ఫ్యాన్స్ తో పాటు మ్యూజిక్ లవర్స్ ను కూడా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం య్యూటూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకెళ్తోంది.  

Latest Videos

మెగాస్టార్ వింటేజ్ లుక్ లో అదరగొట్టారు. ఎప్పటిలాగే తన గ్రేస్ తో అదిరిపోయే స్టెప్పులేసి ఇరగదీశారు. శేఖర్ మాస్టర్ సాంగ్ కు తగ్గట్టుగా కొరియోగ్రఫీ అందించారు. బాస్ లుక్స్ ట్రెండీగా ఉన్నాయి. టోటల్ గా సాంగ్ అభిమానులకు నచ్చేస్తోంది. డైరెక్టర్ మెహర్ రమేశ్ చిరును నయా లుక్ లో చూపించే ప్రయత్నం చేయబోతున్నారని అర్థమవుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశారు. 

ఇక ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia)  ఆడిపాడుతోంది. రీసెంట్ గానే స్విట్జర్లాండ్ లో బ్యూటీఫుల్ సాంగ్ ను కూడా పూర్తి చేశారు. షూటింగ్ తుదిదశకు చేరుకుంది. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగనున్నాయి. మరోవైపు ఈ చిత్రంలో మెగాస్టార్ కు చెల్లెలిగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తోంది. సుశాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. యంగ్ బ్యూటీలు శ్రీముఖి, రష్మీగౌతమ్ కూడా ఆయా పాత్రల్లో మెరియనున్నారు. ఆగస్టు 11న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

 

A MEGA TREAT to all the MEGASTAR fans😎 Lyrical Video out now💥
- https://t.co/ffbdUeBHHA

Megastar in 's Stylish Mass Presentation🔥 🔱 thumping musical🥁 … pic.twitter.com/3GZQyFSS1P

— AK Entertainments (@AKentsOfficial)
click me!