వైరల్ గా ఎస్పీ బాలు రేర్ వీడియో... ఆ పాట ఎన్టీఆర్, ఏఎన్నార్ పాడితే!

By Sambi ReddyFirst Published Jun 4, 2023, 5:19 PM IST
Highlights

బాల సుబ్రహ్మణ్యం తన మిమిక్రీ కళను చూపిస్తూ ఓ వీడియో చేశారు. మిస్సమ్మ మూవీలోని ఆల్ టైం హిట్ 'రావోయి చందమామ' పాటను ఎన్టీఆర్, ఏఎన్నార్, రాజబాబు, అల్లు రామలింగయ్య పాడితే ఎలా ఉంటుందో చూపించారు.

ఎస్పీ బాలు బహుముఖ ప్రజ్ఞాశాలి. సింగర్ గానే కాకుండా నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, మ్యూజిక్ డైరెక్టర్ కూడా రాణించారు. మిగతా సింగర్స్ కంటే బాలు చాలా ప్రత్యేకం. ఆయనకు భాషలు, యాసల మీద పట్టుంది. ఎస్పీ బాలులో మాత్రమే ఉన్న మరో అరుదైన క్వాలిటీ మిమిక్రీ. ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. స్టార్ హీరోలను కమెడియన్స్ ని పర్ఫెక్ట్ గా ఇమిటేట్ చేశారు. ఈ స్కిల్ ఆయనకు చాలా ఉపయోగపడింది. ఆర్టిస్ట్ కి తగ్గట్లు గొంతు మార్చి పాడగల నేర్పరి ఆయన. 

ఎన్టీఆర్ కి ఒకలా ఏఎన్నార్ కి మరోలా పాడతారు. వారు పాడితే ఎలా ఉంటుందో తన గాత్రంలో శృతి తప్పకుండా పాడి చూపిస్తాడు. ఇది బాలును మరింత ప్రత్యేకంగా మార్చేసింది. బాల సుబ్రహ్మణ్యం తన మిమిక్రీ కళను చూపిస్తూ ఓ వీడియో చేశారు. మిస్సమ్మ మూవీలోని ఆల్ టైం హిట్ 'రావోయి చందమామ' పాటను ఎన్టీఆర్, ఏఎన్నార్, రాజబాబు, అల్లు రామలింగయ్య పాడితే ఎలా ఉంటుందో చూపించారు. 

Irreplaceable GEM of our Land. Mana Teluguvaadu… Mana SPB❤️ pic.twitter.com/upjCxU8BkD

— Vamsi Kaka (@vamsikaka)

ఆ రేర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేడు ఎస్పీ బాలు జయంతి నేపథ్యంలో అభిమానులు ఆయన్ని స్మరించుకుంటున్నారు. బాలు ఈ లోకాన్ని వీడి రెండేళ్లు దాటిపోయింది. 2020 సెప్టెంబర్ 25న ఎస్పీ బాలు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనను కరోనా మహమ్మారి కబళించింది. ఆసుపత్రిలో చేరిన బాలు మైల్డ్ అటాక్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వీడియో విడుదల చేశారు. అవే ఆయన చివరి మాటలు. దాదాపు నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడి మరణించారు. జూన్ 4న 1946లో నెల్లూరులో ఎస్పీ బాలు జన్మించారు. ఎస్పీ బాలు సంగీత ప్రపంచాన్ని తిరుగులేని రారాజుగా ఏలారు. దశాబ్దాల పాటు ఆయన గాత్రం విరామం లేకుండా వినిపించింది. ఎస్పీ బాలు వివిధ భాషల్లో డెబ్భై వేలకు పైగా పాటలు పాడారని సమాచారం. 
 

click me!