రామ్ పోతినేని - బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న చిత్రం ‘బోయపాటిరాపో’. సినిమా నుంచి ఇప్పటికే అప్డేట్స్ అందాయి. తాజాగా రామ్ పోతినేని కిర్రాక్ అప్డేట్ ఇచ్చాడు.
ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) - శ్రీలీలా (Sreeleela) జంటగా రూపుదిద్దుకుంటున్న మాస్ యాక్షన్ ఫిల్మ్ BoyapatiRapo. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా రామ్ పోతినేని పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ థండర్ కు యమా రెస్పాన్స్ వచ్చింది. రామ్ పోతినేని మాసీజానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. డైలాగ్స్, మ్యూజిక్ కు థియేటర్లు బద్దలేనంటున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రంపై అటు అభిమానుల్లో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ‘బోయపాటిరాపో’ నుంచి రామ్ పోతినేని మంచి కిక్కిచ్చే అప్డేట్ అందించారు. సినిమా క్లైమాక్స్ పై ట్వీటర్ వేదికన సూపర్ న్యూస్ చెప్పారు.
రామ్ పోతినేని ట్వీట్ చేస్తూ.. ‘ఫైనల్ గా 24 రోజుల పాటు షూట్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ తో క్లైమాక్స్ పూర్తైంది. ఇది క్లైమాక్స్ కాదు.. క్లై‘మ్యాక్స్’‘. అంటూ ట్వీట్ చేశారు. రామ్ పోతినేనిని ట్వీట్ తో సినిమాపై మరింత అంచనాలు నెలకొన్నాయి. మాస్ యాక్షన్ ను చూపించడంలో బోయపాటి మార్క్ ఈసారి ఏరేంజ్ లో ఉండబోతోందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
కొద్దిరోజుల్లో షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకోనున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందనున్నాయి. ఈ క్రమంలో రాబోయే అప్డేట్స్ పైనా హైప్ నెలకొంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా రూపొందిస్తుండగా.. నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. శ్రీలీలా కథానాయిక. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా స్పెషల్ అపియరెన్స్ ఇవ్బబోతోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Finally! Done with the insane 24 days action sequence.
Idhi Climax kaadhu… CliMAXXXXX!