`భీమా` ట్రైలర్‌.. కరుణే చూపని బ్రహ్మారాక్షసుడు భూమిపైకి వస్తే.. గోపీచంద్‌ విశ్వరూపం..

Published : Feb 24, 2024, 05:18 PM IST
`భీమా` ట్రైలర్‌.. కరుణే చూపని బ్రహ్మారాక్షసుడు భూమిపైకి వస్తే.. గోపీచంద్‌ విశ్వరూపం..

సారాంశం

వరుస పరాజయాలతో ఉన్న గోపీచంద్‌ ఇప్పుడు సక్సెస్‌ కోసం ఓ మాస్‌ యాక్షన్‌ మూవీ `భీమా` అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ వచ్చింది. గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది.

మ్యాచో స్టార్‌ గోపీచంద్‌ సక్సెస్‌ కోసం స్ట్రగుల్‌ అవుతున్నాడు. ఆయన ఇటీవల నటించిన అన్ని సినిమాలు బోల్తా కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తన వింటేజ్‌లోకి వెళ్లిపోయాడు. అసలైన మాస్‌ మూవీస్‌తో వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన `భీమా` అనే చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ విడుదలైంది. పరశురాముడి కాన్సెప్ట్ తో వస్తోన్న చిత్రమిది. విడుదలైన ట్రైలర్‌ గూస్‌ బంమ్స్ తెప్పిస్తుంది. డివోషనల్‌ అంశాలు, యాక్షన్‌ ఎలిమెంట్లు, థ్రిల్లర్‌ అంశాలతో ఈ ట్రైలర్ సాగింది. 

`శ్రీ మహావిష్ణుణి ఆరవ అవతారం పరశురాముడు. తన గండ్ర గొడ్డలతో అనంత సాగరాన్నే వెనక్కి పంపి, ఒక అద్భుతమైన నేలని సృష్టించాడు. అదే పరశురాముడి క్షేత్రం. అక్కడ ఆ పర శివుడే కొలువయ్యాడు. కొందరు రాక్షసులు తమ ఆహాంకారంతో విర్రవీగుతున్నప్పుడు, వాళ్ల అంతుకోరి త్రినేత్రుడే కాలనేత్రుడై కరుణే చూపని ఒక బ్రహ్మ రాక్షసుడిని పంపాడు` అంటూ బ్యాక్‌ గ్రౌండ్‌ లో వచ్చే వాయిస్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. గోపీచంద్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ప్రత్యర్థుల అంతు చూస్తుంటాడు. ఈక్రమంలో ఆయన ఓ వైపు పోలీస్‌గా, మరోవైపు భయంకరమైన రూపంలో దర్శనమివ్వడం విశేషం. ఇందులో గోపీచంద్‌ రెండు పాత్రల్లో నటిస్తున్నాడా? పాత్రలో రెండు షేడ్స్ ఉన్నాయా? ఆసక్తికరంగా మారింది. 

దీంతోపాటు ఒక దట్టమైన అడవిలో అఘోరల యజ్ఞాలు, హోమాలు, పూజలు, చేతబడులు వంటి ఎలిమెంట్లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అనేక సూపర్‌నేచురల్ ఎలిమెంట్లు కూడా ఇందులో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఫారెస్ట్ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే కుట్రలను హీరో ఎలా అంతం చేశాడనే కథతో `భీమా` మూవీ తెరకెక్కుతుందని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. ఇందులో గోపీచంద్‌ లుక్‌ అదిరిపోయింది. అదే సమయంలో ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. మార్చి 8న మహాశివరాత్రి రోజున ఈ మూవీ విడుదల కానుండటం విశేషం.  

గోపీచంద్‌ సరసన ప్రియా భవాని శంకర్‌, మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఏ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. రవి బస్సూర్‌ సంగీతం అందిస్తున్నారు. కెకె రాధా మోహన్‌ నిర్మిస్తున్న చిత్రమిది. 

Read more: వేల కోట్ల ఆస్తి, రాయల్‌ లైఫ్‌ నుంచి రోడ్డున పడ్డ జేడీ చక్రవర్తి ఫ్యామిలీ.. ఆ రెండేళ్లు ఏం జరిగింది?
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి
IMDb రేటింగ్ ప్రకారం 2025 లో టాప్ 10 సినిమాలు, సౌత్ సినిమాల ముందు తలవంచిన బాలీవుడ్