Raghava Lawrence Decision : పొరపాటును సరిదిద్దుకుంటున్న రాఘవా లారెన్స్.. ఫ్యాన్స్ కోసం కీలక నిర్ణయం

Published : Feb 24, 2024, 03:50 PM IST
Raghava Lawrence Decision : పొరపాటును సరిదిద్దుకుంటున్న రాఘవా లారెన్స్.. ఫ్యాన్స్ కోసం కీలక నిర్ణయం

సారాంశం

స్టార్ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవా లారెన్స్ (Raghava Lawrence)  ఫ్యాన్స్ కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో తన అభిమాని చనిపోవడంతో తాజాగా ఆయన ఇంట్రెస్టింగ్ ప్రకటన చేశారు. 

స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, నటుడు రాఘవా లారెన్స్ (Raghava Lawrence) దక్షిణాదిలో తనదైన ముద్ర వేసుకున్నారు. స్టార్ హీరోలతో వర్క్ చేసిన రాఘవా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఆయన సినిమాలతో అలరించడంతో  పాటు వ్యక్తిత్వంతో డైహార్ట్ ఫ్యాన్స్ ను కూడా సంపాదించుకున్నారు. రాఘవాకు ఏం రేంజ్ లో అభిమానులు ఉంటారో తెలిసిందే. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆయనపై ఎప్పుడూ అభిమాన వర్షం కురిపిస్తూనే ఉంటారు. ఇక ఆయన సినిమా వేడుకల్లో మరింతగా సందడి  చేస్తుంటారు. 

 ఇక రాఘవా లారెన్స్ కూడా తన అభిమానుల కోసం తనవంతుగా చేయాల్సి న పనులు చేస్తూనే వస్తున్నారు. ఆయన సేవా మార్గాన్నే ఫ్యాన్స్ కూడా అనుసరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు రాఘవాలారెన్స్ ఫ్యాన్స్  తో సెల్ఫీలు దిగే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అయితే గతేడాది తన  అభిమాని ఒకరు ఫ్యాన్ మీట్ కు హాజరై వెళ్లే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అప్పటి నుంచి తనకోసం ఫ్యాన్స్ ప్రయాణం చేయకుండా నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు తానే స్వయంగా అభిమానుల వద్దకు వెళ్లి సెల్పీలు ఇస్తానని చెప్పారు. 

తాజాగా ఫ్యాన్స్ ను కలిసే కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ట్వీటర సంబంధించిన వివరాలను పేర్కొన్నారు. ‘హాయ్ ఫ్రెండ్స్, ఫ్యాన్స్, చివరిసారిగా చెన్నైలో ఫ్యాన్స్ మీట్ ఫోటోషూట్ సందర్భంగా నా అభిమాని ఒకరు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఇది చాలా హృదయ విదారకంగా ఉంది. ఆ రోజు, నా అభిమానులు నా కోసం ప్రయాణం చేయకూడదని నిర్ణయించుకున్నాను. నేనే వారి కోసం ప్రయాణం చేస్తాను. వారి పట్టణంలో ఫోటోషూట్ నిర్వహిస్తాను. రేపటి నుండి ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాను. రేపు మొదట విల్లుపురం లోగలక్ష్మి మహల్ వద్ద కలుద్దాం.’ అని ప్రకటించారు. దీంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక రాఘవా చివరిగా ‘జిగర్ తండా’ (Jigar Thanda) చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి