`భీమ్లా నాయక్‌` అప్‌డేట్‌ః డానియెల్‌ శేఖర్‌ టైమ్‌ స్టార్ట్

Published : Sep 17, 2021, 04:23 PM IST
`భీమ్లా నాయక్‌` అప్‌డేట్‌ః డానియెల్‌ శేఖర్‌ టైమ్‌ స్టార్ట్

సారాంశం

మరోవైపు ఇన్నాళ్లపాటు రానా నటిస్తున్న పాత్రకి తక్కువ ప్రయారిటీ ఇస్తూ వస్తున్నాయి. అయితే అదంతా ఓ ప్లానింగ్‌ ప్రకారం చేస్తున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రానా నటిస్తున్న డానియెల్‌ శేఖర్‌ పాత్ర లుక్‌లు విడుదల చేయబోతున్నారు. `బ్లింట్జ్ ఆఫ్‌ డానియెల్‌ శేఖర్‌` ని విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం శుక్రవారం ప్రకటించారు.

పవన్‌ కళ్యాణ్‌, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న చిత్రం `భీమ్లా నాయక్‌`. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. త్రివిక్రమ్‌ మాటలు, కథనం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న భీమ్లా నాయక్‌ పాత్ర లుక్‌, ఫస్ట్ గ్లింప్స్ లను విడుదల చేయగా, వాటికి సోషల్‌ మీడియాలో విశేష స్పందన లభించింది.

మరోవైపు ఇన్నాళ్లపాటు రానా నటిస్తున్న పాత్రకి తక్కువ ప్రయారిటీ ఇస్తూ వస్తున్నాయి. అయితే అదంతా ఓ ప్లానింగ్‌ ప్రకారం చేస్తున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రానా నటిస్తున్న డానియెల్‌ శేఖర్‌ పాత్ర లుక్‌లు విడుదల చేయబోతున్నారు. `బ్లింట్జ్ ఆఫ్‌ డానియెల్‌ శేఖర్‌` ని విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం శుక్రవారం ప్రకటించారు. సెప్టెంబర్‌ 20న రానా నటిస్తున్న డానియెల్‌ శేఖర్‌ పాత్ర గ్లింప్స్ ని రిలీజ్‌ చేయబోతున్నారు. ఇక రానా టైమ్‌ స్టార్ట్ కాబోతుందంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 

ఇక ఈ చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌ సరసన నిత్యా మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. రానా సరసన ఐశ్వర్యా రాజేష్‌ నటిస్తుంది. అయితే ఐశ్వర్యా రాజేష్‌ కి డేట్స్ కుదరకపోవడంతో మరో నటిని తీసుకోవాలనుకుంటున్నారట. సంయుక్త మీనన్‌ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా మలయాళ సూపర్‌ హిట్‌ `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` కి రీమేక్‌గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి జనవరి 12న విడుదల చేయబోతున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

ఓటీటీలో మీకోసం వీకెండ్‌ లో దుమ్మురేపే 5 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు
Karthika Deepam 2 Today Episode: కాశీని రెచ్చగొట్టిన వైరా- శ్రీధర్ అరెస్ట్- రక్తం కక్కుకున్న సుమిత్ర