Bheemla Nayak Bike Ride: బుల్లెట్‌పై దూసుకెళ్తున్న పవన్‌ కళ్యాణ్‌‌.. వీడియో వైరల్‌

Published : Dec 18, 2021, 06:17 PM ISTUpdated : Dec 18, 2021, 06:19 PM IST
Bheemla Nayak Bike Ride: బుల్లెట్‌పై దూసుకెళ్తున్న పవన్‌ కళ్యాణ్‌‌.. వీడియో వైరల్‌

సారాంశం

తాజాగా ఈ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. వికారాబాద్‌లో ప్రస్తుతం ఓ షెడ్యూల్‌ జరుగుతుంది. వికారాబాద్‌ దగ్గర అడవుల్లో ఈ షూట్‌ జరుగుతుంది. ఆ ప్రాంతంలో బుల్లెట్‌ బైక్‌పై పవన్‌ దుసుకెళ్తున్న వీడియో ఒకటి వైరల్‌ అవుతుంది.

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan), రానా(Rana) హీరోలుగా రూపొందుతున్న మల్టీస్టారర్‌ చిత్రం `భీమ్లానాయక్‌`(Bheemla Nayak). త్రివిక్రమ్‌ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహించారు. టాలీవుడ్‌లో అత్యంత ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్న చిత్రాల్లో ఇదొకటి. నిత్యా మీనన్‌, సంయుక్త మీనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతుంది. 

ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. వికారాబాద్‌లో ప్రస్తుతం ఓ షెడ్యూల్‌ జరుగుతుంది. వికారాబాద్‌ దగ్గర అడవుల్లో ఈ షూట్‌ జరుగుతుంది. భీమ్లా నాయక్‌ పాత్రలో నటిస్తున్న పవన్‌ కళ్యాణ్‌, డేనియల్‌ శేఖర్‌ పాత్రలో నటిస్తున్న రానాల మధ్య పలు కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. యాక్షన్‌ సీక్వెన్స్ షూట్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే పవన్‌ వికారాబాద్‌ అడవుల సమీపంలో షూటింగ్‌లో పాల్గొంటున్నాడని తెలిసి అక్కడకి భారీగా అభిమానులు చేరుకున్నారు. షూటింగ్‌ సమయంలో అభిమానులను కంట్రోల్‌ చేయడం కష్టంగా మారిందట. 

ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో బుల్లెట్‌ బైక్‌పై Pawan దుసుకెళ్తున్న వీడియో ఒకటి వైరల్‌ అవుతుంది. పవన్‌ బైక్‌ రైడింగ్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. పోలీస్‌ దుస్తుల్లో ఉన్న పవన్‌ బైక్‌పై శరవేగంగా రైడ్‌ చేస్తున్నారు. ఇది అభిమానులను ఆకట్టుకుంటుంది.దీంతో వీడియోని షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. మరోవైపు బైక్‌పై వెళ్తున్న పవన్‌ని, ముందు, వెనుక కార్లు ఫాలో అవుతున్న వీడియో సైతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. పోలీస్‌ దుస్తుల్లో పవన్‌ని డైరెక్ట్ గా చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 

`భీమ్లా నాయక్‌` చిత్రం నుంచి ఇప్పటికే భీమ్లా నాయక్‌, డేనియర్‌ శేఖర్‌ పాత్రల గ్లింప్స్ లు విడుదలై ఆకట్టుకున్నాయి. పవన్‌, రానాల మధ్య కాన్ఫ్లిక్ట్స్ అదిరిపోయేలా ఉంది. రెండు పాత్రలు హోరాహోరిగా ఉంటాయని అర్థమవుతుంది. దీంతోపాటు `భీమ్లా నాయక్‌` టైటిల్‌ ట్రాక్‌, `లాలా భీమ్లా` పాటలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా `లాలా భీమ్లా ` పాట ఉర్రూతలూగించింది. మహిళలపై వచ్చే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇది సినిమాకే హైలైట్‌గా నిలవనుంది. ఎస్‌ఎస్‌. థమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ముందు `ఆర్‌ఆర్‌ఆర్‌`, వెనకాల `రాధేశ్యామ్‌` చిత్రాలు విడుదల కాబోతుండగా,  `భీమ్లా నాయక్‌` మధ్యలో రిలీజ్‌ కాబోతుంది. సినిమా విడుదల అవుతుందా? అనే సందేహాలు నెలకొన్ని నేపథ్యంలో చిత్ర బృందం ఎట్టకేలకు అనుకున్న టైమ్‌కి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారట. 

also read: Firstday Collections-Roundup 2021: పవన్‌ని కొట్టలేకపోయిన బన్నీ.. బాలయ్య, రవితేజ ఈ ఏడాది ఎవరి లెక్క ఎంత ?

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్
నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా