పెళ్లి కూతురు కాబోతున్న భావన

Published : Mar 09, 2017, 02:13 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
పెళ్లి కూతురు కాబోతున్న భావన

సారాంశం

మళయాళ నటి భావన నిశ్చితార్ధం నిర్మాత నవీన్ తో ఎంగేజ్ మెంట్ జరుపుకున్న భావన కిడ్నాప్ కలకలం తర్వాత కళతప్పిన భావనకు తిరిగి కళ

ఇటీవల కిడ్నాప్ కలకలంతో తీవ్ర ఒ్తతిడికి లోనైంది దక్షిణాది సినీ తార భావన. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించిన భావన గత కొంత కాలంగా మనస్థాపంతో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె జీవితంలో మళ్లీ చిరునవ్వులు పూసాయి. భావన మలయాళ నిర్మాత నవీన్‌తో గురువారం నిశ్చితార్థం చేసుకున్నారు. కొందరు అతిథుల మధ్య ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. మూవీ ఇండస్ట్రీకి చెందిన రమేష్ బాలా తన ట్విటర్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ కాబోయే దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు.

 

ఇంకా పెళ్లి తేదీని నిర్ణయించలేదని ట్వీట్‌ చేశారు. భావన, నవీన్‌ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని భావన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాము 2014లోనే వివాహం చేసుకోవాలనుకున్నామని, కానీ వృత్తిపరంగా ఉన్న నిబద్ధతల వల్ల కుదరలేదని అప్పట్లో ఆమె అన్నారు. ‘మహాత్మ’, ‘ఒంటరి’, ‘నిప్పు’ వంటి తెలుగు చిత్రాల్లో నటించిన భావన అనేక మలయాళ చిత్రాల్లో నటించారు.

 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు