వరుణ్ తేజ్ మిస్టర్ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్

Published : Mar 09, 2017, 01:43 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
వరుణ్ తేజ్ మిస్టర్ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్

సారాంశం

శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్  

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా మిస్టర్. వరుస ఫ్లాప్లతో కష్టాల్లో ఉన్న శ్రీనువైట్ల దర్శకత్వంలో లోఫర్ సినిమాతో నిరాశపరిచిన వరుణ్ హీరోగా నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమా ఈ ఇద్దరి కెరీర్లకు కీలకంగా మారింది. ఇటీవల విడుదలైన టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. టీజర్ రిలీజ్ తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న మిస్టర్ పేరు ఇప్పుడు సడన్గా తెర మీదకు వచ్చింది.



ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ చాలా ఆలస్యం కావటంతో వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. షూటింగ్ మధ్యలో వరుణ్ కాలికి గాయం కావటంతో దాదాపు రెండు నెలల పాటు షూటింగ్ వాయిదా వేశారు. దీంతో సినిమా ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకోవటంతో ఏప్రిల్ 14న సినిమా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఏప్రిల్ నెలాఖరు నుంచి భారీ చిత్రాలు క్యూ కడుతుండటంతో  చిన్న మీడియం రేంజ్ సినిమాల రిలీజ్కు డేట్ దొరకటం కష్టమే.



ఏప్రిల్ మొదటి వారంలో గురు, చెలియా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఏప్రిల్ 28న బాహుబలి 2 రిలీజ్ అవుతోంది. దీంతో గ్యాప్ ఏప్రిల్ 14న మిస్టర్ రిలీజ్ చేస్తే బెటర్ అని అనుకుంటున్నారట. వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, హేబా పటేల్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను నల్లమలపు బుజ్జి, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?
Gurram Paapi Reddy Review: గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ, రేటింగ్‌.. బ్రహ్మానందం, యోగిబాబు సినిమా ఎలా ఉందంటే?