
తెలుగు సినిమాలో బడా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మరో ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ కు సిద్ధమయ్యాడా? అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. ఇన్నాళ్లు తెలుగులో టాప్ హీరోల సినిమాలతో హంగామా చేసిన దిల్ రాజు ఈసారి తమిళ అగ్ర దర్శకుడు శంకర్ తో కలిసి కమల్ హీరోగా సినిమా ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తోంది. కమల్ హాసన్ శంకర్ ల కలయికలో వచ్చిన భారతీయుడు సినిమా సీక్వల్ రూపొందించే పనిలో దిల్ రాజు తలమునకలై ఉన్నాడని సమాచారం అందుతోంది.
ఇప్పటికే వీరి మధ్య చర్చలు జరిగాయని తెలుస్తుంది. దసరా సందర్భంగా బిగ్ బాస్ ఫైనల్ డే రోజు కమల్ శంకర్ దిల్ రాజు కలిసి ఈ ఎనౌన్స్ మెంట్ చేసారు. దిల్ రాజు నిర్మాణ సంస్థ అధికారిక ట్విటర్ లో కూడా కమల్, శంకర్ లతో అసోసియేట్ కావడం అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ భారతీయుడు సీక్వల్ పై అంచనాలు పెంచేస్తున్నాయి.
ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉండబోతుందట. సినిమా టైటిల్ గా ఇండియన్-2 అని రిజిస్టర్ చేయించారట. ప్రస్తుతం శంకర్ రోబో సీక్వల్ గా 2.0 చేస్తుండగా ఆ తర్వాత వెంటనే భారతీయుడు సీక్వల్ ఉండబోతుందని తెలుస్తుంది. తెలుగు తమిళ భాషల్లోనే కాదు హిందిలో కూడా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తారట.
ఇక సౌత్ లాంగ్వేజెస్ అన్నిటిలో ఈ సినిమా రిలీజ్ అవుతుందట. ఇన్నాళ్లు టాలీవుడ్ లోనే బడా ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ తో సంచలనం సృష్టిస్తాడని చెప్పొచ్చు.