రామ్ చరణ్ తో మగధీర 2 ప్లాన్ చేస్తున్న జక్కన్న?

Published : Oct 01, 2017, 01:03 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
రామ్ చరణ్ తో మగధీర 2 ప్లాన్ చేస్తున్న జక్కన్న?

సారాంశం

బాహుబలితో క్రేజీ డిరెక్టర్ గా మారిన రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన జక్కన్న రాజమౌళి తరువాతి సినిమా ఎవరితో అనే అంశంపై రకరకాల వార్తలు రామ్ చరణ్ తో మగధీర 2 సినిమా చేస్తారని తాజా సమాచారం

దర్శక కధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన 'మగధీర' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నారు. దీంతో అప్పట్లోనే వీరిద్దరు కలిసి మరో సినిమా చేస్తారనే మాటలు వినిపించాయి. కానీ రాజమౌళి కొన్ని అభిప్రాయబేధాల కారణంగా మెగా కాంపౌండ్ నుండి దూరంగా జరిగారు. దీంతో వీరి కాంబినేషన్‌లో సినిమా అంటే సందేహం కలిగేది. కానీ ఇప్పుడు మరోసారి రాజమౌళి.. రామ్ చరణ్‌ను డైరెక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.



బాహుబలి సినిమా తరువాత రాజమౌళి ఎవరితో సినిమా చేస్తారనే విషయంలో క్లారిటీ లేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయేంద్రప్రసాద్ మగధీర సినిమాకు సీక్వెల్ చేయాలనుందని వెల్లడించారు. మరి రాజమౌళి 'మగధీర' సీక్వెల్ సినిమా చేస్తారా? లేక మరో కథను ఎన్నుకుంటారా? అనే విషయాల్లో స్పష్టత లేనప్పటికీ చరణ్‌తో సినిమా చేయడానికి మాత్రం ప్లాన్ చేస్తున్నారని టాక్. ప్రస్తుతం రామ్ చరణ్ 'రంగస్థలం' సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత కొరటాల శివతో మరో ప్రాజెక్ట్ ఓకే చేశాడు. రాజమౌళి ఒకవేళ చరణ్‌కు ఛాన్స్ ఇస్తే.. వెంటనే ఆ సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి.

PREV
click me!

Recommended Stories

Sivakarthikeyan: హీరోలు ఒకరి తర్వాత ఒకరు..దుబాయ్ మోజు వెనుక ఇదే కారణం!
Amla Paul: కొడుకుతో క్యూట్ ఫోటోలని షేర్ చేసిన అమలాపాల్.. నెటిజన్ల విమర్శలు