
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన భరత్ రెడ్డి ఇప్పుడు ఓ బయోపిక్ లో కీలకపాత్రకు ఎంపికైనట్లు తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తోన్న ఈ సినిమాలో విద్యాబాలన్, రానా, రకుల్ ప్రీత్ సింగ్, సుమంత్ వంటి తారలు కనిపించనున్నారు. ఇప్పుడు సినిమాలో ఎన్టీఆర్ అల్లుడి పాత్ర దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డిని ఫైనల్ చేశారు.
సినిమాలో ఎన్టీఆర్ ఇద్దరి అల్లుళ్ల పాత్రలను చూపించబోతున్నారు. నారా చంద్రబాబు నాయుడు పాత్రను రానా పోషిస్తుండగా, దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్రలో భరత్ రెడ్డి కనిపించనున్నాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో దగ్గుబాటి వెంకటేశ్వరావు కీలక పాత్ర పోషించాడు. అందుకే సినిమాలో ఆయన పాత్ర ప్రధానంగా సాగుతుందని సమాచారం.
ఈ పాత్రలో భరత్ అయితే బాగుంటాడని నిర్మాతలు ఆయనని సెలెక్ట్ చేసుకున్నారు. సినిమా మొత్తం కూడా ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఎలా ఎదిగారని విషయాలను ఎక్కువగా చూపించనున్నారు.
ఇవి కూడా చదవండి..
ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య కొత్త లుక్.. అచ్చం తండ్రిలానే!
షాకింగ్ న్యూస్.. ఎన్టీఆర్ బయోపిక్ లో చిరంజీవి?