ముద్దుకి కొత్త నిర్వచనం.. పేపర్ బాయ్ ట్రైలర్!

By Udayavani DhuliFirst Published Aug 18, 2018, 11:11 AM IST
Highlights

ధరణి.. నేను చదివిని మొట్ట మొదటి కవిత.. ఈ మూడు అక్షరాలూ నాకు పరిచయమైంది పుస్తకాల్లో.. దగ్గరైంది అక్షరాల్లో

సంతోష్ శోభన్, రియా సుమన్ జంటగా దర్శకుడు జయశంకర్ రూపొందిస్తోన్న సినిమా 'పేపర్ బాయ్'. సంపత్ నంది నిర్మిస్తోన్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ట్రైలర్ చూసిన వారు 'వావ్' అనకుండా ఉండలేరు.

ట్రైలర్ లో వినిపించిన ప్రతి డైలాగ్ ఆడియన్స్ కు కనెక్ట్ అయిపోతుంది. 'ధరణి.. నేను చదివిని మొట్ట మొదటి కవిత.. ఈ మూడు అక్షరాలూ నాకు పరిచయమైంది పుస్తకాల్లో.. దగ్గరైంది అక్షరాల్లో..' అంటూ హీరో చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది.

'ప్రేమంటే ఆక్సిజన్ లాంటిది.. అది కనిపించదు కానీ బ్రతికిస్తుంది..', 'ముద్దుపెట్టుకోవడం అంటే పెదాలు మార్చుకోవడం కాదు.. ఊపిరి మార్చుకోవడం'.. ఇలా ట్రైలర్ లో వినిపించిన మాటలు యూత్ కి కనెక్ట్ అయిపోతాయి. ఓ పేపర్ బాయ్.. సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి ఇద్దరూ ప్రేమించుకుంటే ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటాయనే కథతో ఈ సినిమాను రూపొందించారు. ట్రైలర్ లో వినిపించిన నేపధ్య సంగీతం, సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటున్నాయి. మరి విడుదలైన తరువాత సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి!

 

click me!