తండ్రి కోసం కార్తికేయ పోరాటం.. `భజే వాయు వేగం` ట్రైలర్‌ ఎలా ఉందంటే?

Published : May 25, 2024, 04:52 PM IST
తండ్రి కోసం కార్తికేయ పోరాటం.. `భజే వాయు వేగం` ట్రైలర్‌ ఎలా ఉందంటే?

సారాంశం

యంగ్‌ హీరో కార్తికేయ గుమ్మకొండ ఇప్పుడు `భజే వాయు వేగం` చిత్రంతో వస్తున్నారు. ఈ వారం రిలీజ్‌ కానున్న ఈ మూవీ ట్రైలర్‌ వచ్చింది. మరి ట్రైలర్‌ ఎలా ఉందంటే?  

హీరో కార్తికేయ `ఆర్‌ఎక్స్ 100`తో ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్‌ చేశాడు. ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయాడు. డిఫరెంట్‌ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రంపెద్ద విజయం సాధించడంతో కార్తికేయకి సినిమాలు క్యూ కట్టాయి. ఆ ఫ్లోలో వరుసగా మూడు నాలుగు కథలను ఓకే చేశాడు. కానీ అవన్నీ బెడిసికొట్టాయి. సక్సెస్‌ ఆనందంలో తీసుకున్న నిర్ణయం తేడా కొట్టింది. వరుసగా పరాజయాలను ఫేస్‌ చేశాడు కార్తికేయ గుమ్మకొండ.. చివరగా ఆయన `బెదురులంక` చిత్రంతో ఫర్వాలేదనిపించుకున్నారు. ఇది ఓ మోస్తారు విజయాన్ని సాధించింది. 

ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. `భజే వాయు వేగం` అనే చిత్రంలో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ప్రశాంత్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కార్తికేయకి జోడీగా ఐశ్వర్య మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్ బ్యానర్‌పై తెరకెక్కుతుంది. అజయ్‌ కుమార్‌ రాజు పి సహ నిర్మాత. ఈ మూవీ ఈ నెల 31న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా శనివారం ట్రైలర్ ని రిలీజ్‌ చేశారు. 

సినిమా తండ్రి కోసం కొడుకు చేసే పోరాటం ప్రధానంగా సాగుతుందని ట్రైలర్‌ని చూస్తుంటే తెలుస్తుంది. ఓ బ్యాగ్‌తో హీరో కార్తికేయ పరార్‌ అవుతాడు. దీంతో పోలీసులు చెక్‌ పోస్ట్ పెట్టి వెహికల్స్ ని చెక్‌ చేస్తుంటారు. ఆ బ్యాగులో ఎంత ఉందోతెలుసారా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు విలన్‌ రవిశంకర్‌. కార్తికేయని పట్టుకునేందుకు రేస్‌ నడుస్తుంది. వాళ్ల నుంచి తప్పించుకుంటాడు కార్తికేయ. టామ్‌ అండ్ జెర్రీలా నడుస్తున్న క్రమంలో కార్తికేయ నాన్న తనికెళ్ల భరణి ఆసుపత్రిలో చావుబతుకుల్లో ఉంటాడు. ట్రీట్‌మెంట్ కి లక్షల్లో ఖర్చు అవుతుంది. ఆ డబ్బు ఎలా అనేది పెద్ద ప్రశ్న. 

అయితే కొట్టేసిన డబ్బు నాన్న ట్రీట్‌మెంట్‌కి ఖర్చు చేయాలనుకుంటాడు. ఆ బ్యాగ్‌ ఇచ్చి, ట్రీట్‌మెంట్కి కావాల్సిన డబ్బు తీసుకుపో అని విలన్‌ ఆఫర్‌ ఇస్తాడు. మరోవైపు మన నాన్న కాదు, నా నాన్న అని హ్యాపీడేస్‌ ఫేమ్‌ టైసన్‌ చివర్లో ట్విస్ట్ ఇవ్వడంతో ట్రైలర్‌ ముగిసింది. మరి ఇంతకి కార్తికేయ ఎవరు? ఆయన కథేంటి అనేది ఆసక్తిని రేకెత్తించేలా ట్రైలర్‌ సాగింది. ఆద్యంతం రేసీగా పరిగెత్తించేలా ట్రైలర్‌ ఉండటం విశేషం. కార్తికేయ ఈ సారి హిట్‌ కొట్టేందుకు గట్టి ప్రయత్నం చేశాడని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. మరి సక్సెస్‌ వస్తుందా లేదా అనేది చూడాలి. ఈ మూవీ ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ద్వారా విడుదల కాబోతుంది.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌
రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?