`భైరవం` మూవీపై `ఖలేజా` దెబ్బ.. మంచు మనోజ్‌, నారా రోహిత్, బెల్లంకొండ నటించిన సినిమా ఎంత రాబట్టిందంటే?

Published : May 31, 2025, 08:00 PM IST
bhairavam movie review

సారాంశం

మంచు మనోజ్‌, నారా రోహిత్‌, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కలిసి నటించిన `భైరవం` మూవీ శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రం మొదటి రోజు ఎంత వసూలు చేసిందంటే?

మంచు మనోజ్‌, నారా రోహిత్‌, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కలిసి నటించిన మూవీ `భైరవం`. ముగ్గురు హీరోలు కలిసి నటించిన ఈ మూవీపై ప్రత్యేకమైన బజ్‌ ఏర్పడింది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమాని కెకె రాధామోహన్‌ నిర్మించారు.

 ఇందులో ఆనంది, దివ్య పిళ్లై, అదితి శంకర్ హీరోయిన్లుగా నటించారు. జయసుధ కీలక పాత్రలో నటించింది. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది.

`భైరవం`లో ముగ్గరు హీరోల ఎలివేషన్లు, హీరోయిజంకి ప్రయారిటీ

మాస్‌ ఎలిమెంట్లు, ముగ్గురు హీరోల హీరోయిజం, ఎలివేషన్లు, స్నేహం, సెంటిమెంట్‌, ఎమోషన్స్, లవ్‌, వంటి అంశాల మేళవింపుగా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు విజయ్‌ కనకమేడల. ఇది తమిళంలో వచ్చిన `గరుడన్‌` చిత్రానికి రీమేక్‌. 

తెలుగులో మాస్‌, యాక్షన్‌ అంశాలకు ప్రయారిటీ ఇచ్చారు. హీరోయిజం పెంచారు. ఫ్రెష్‌గా చూసిన వారికి బాగానే నచ్చుతుంది. ఆల్‌రెడీ తమిళంలో చూస్తే దానితో పోల్చితే ఆ స్థాయిలో లేదనే టాక్‌ వినిపిస్తుంది.

`భైరవం` మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు

ఇక శుక్రవారం విడుదలైన `భైరవం` మూవీకి మిశ్రమ స్పందన లభించినా మంచి వసూళ్లని రాబట్టింది. ఈ చిత్రం తొలి రోజు రూ.3.60 కోట్లు(గ్రాస్‌) రాబట్టింది. రెండు కోట్ల షేర్‌ వచ్చింది. 

ఈ చిత్రం నైజాంలో రూ.65లక్షలు, సీడెడ్‌లో రూ.25 లక్షలు, ఆంధ్రాలో రూ.75 లక్షలు వసూలు చేసి.. ఏపీ, తెలంగాణలో 1.65కోట్ల షేర్‌ని, 2.75కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఇతర ఇండియా మొత్తం, ఓవర్సీస్‌లో కలిపి మరో కోటీ వరకు గ్రాస్‌ వచ్చినట్టు తెలుస్తుంది.

`భైరవం` సినిమాపై మహేష్‌ `ఖలేజా` దెబ్బ

అయితే ముగ్గురు హీరోలు కలిసి నటించిన మూవీ కావడంతో చాలా అంచనాలే ఉన్నాయి. కానీ వాటిని అందుకోవడంలో సక్సెస్‌ కాలేకపోయింది. ఈ మూవీకి మరో రూపంలో గట్టి దెబ్బ పడింది. మహేష్‌ బాబు చావు దెబ్బ కొట్టాడని చెప్పొచ్చు. 

మహేష్‌ బాబు నటించిన `ఖలేజా` మూవీని శుక్రవారం రీ రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. దీనికి విశేష స్పందన లభించింది. మహేష్‌ ఫ్యాన్స్, యూత్‌ అంతా ఈ మూవీని ఎగబడి చూశారు. 

ఏ, బీ సెంటర్లలో చాలా వరకు `ఖలేజా` సినిమానే ఆక్యుపై చేసింది. దీంతో శుక్రవారం విడుదలైన సినిమాలపై ఇది చాలా ప్రభావం చూపించింది. 

కేవలం `భైరవం` సినిమాపైనే కాదు, ఇతర చిత్రాలపై కూడా `ఖలేజా` దెబ్బ గట్టిగానే ఉందని చెప్పొచ్చు. ఈ మూవీ ఒక్కరోజే ఏకంగా ఎనిమిదన్నర కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్‌ చేయడం విశేషం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్
Bigg Boss Telugu 9 Elimination: బిగ్‌ బాస్‌ ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్.. 13 వారం ఈ కంటెస్టెంట్ ఔట్‌