నటి కల్పికపై పబ్‌ నిర్వాహకులు దాడి.. కేక్‌ విషయంలో గొడవ

Published : May 31, 2025, 05:34 PM ISTUpdated : May 31, 2025, 05:35 PM IST
actress kalpika

సారాంశం

నటి కల్పిక వివాదంలో ఇరుక్కుంది. ఆమెకి పబ్‌ నిర్వాహకులకు మధ్య గొడవ జరిగింది. కేక్‌ విషయంలో జరిగిన గొడవ ఇప్పుడు పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్లింది.

నటి కల్పికపై పబ్‌ నిర్వాహకుల దాడి

హైదరాబాద్‌లో పబ్‌ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. తాజాగా నటి కల్పికపై హైదరాబాద్‌లోని ప్రిజం పబ్‌ నిర్వాహకులు దాడి చేశారు.  నటి కల్పిక శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌ గచ్చిబౌలి విప్రో సర్కిల్‌లో గల ప్రిజం పబ్‌కి తన స్నేహితులతో కలిసి వెళ్లింది. 

అయితే అందులో కేక్‌ విషయంలో కల్పికకి, పబ్‌ నిర్వాహకులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మాట మాట పెరగడంతో నిర్వాహకులు కల్పికపై దాడికి దిగారని తెలుస్తుంది.

పోలీసులు కూడా దురుసు ప్రవర్తన, కేసు నమోదు

దీనిపై కల్పిక రియాక్ట్ అవుతూ కేక్‌ విషయంలో నిర్వాహకులు తనపై దురుసుగా ప్రవర్తించారని ఆరోపించింది. పబ్‌ యాజమాన్యం పట్ల పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు కూడా అలానే ప్రవర్తించారని కల్పిక ఆరోపించింది. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇందులో కల్పిక డ్రగ్గిస్ట్ అని పబ్‌ నిర్వాహకులు ఆరోపించడం దుమారం రేపుతుంది. ఈ గొడవకి సంబంధించిన ఓ వీడియో సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

కల్పిక నటించిన సినిమాలు

కల్పిక నటిగా చాలా సినిమాలు చేసింది. 2009 నుంచి ఆమె ఇండస్ట్రీలో ఉంది. `ప్రయాణం` అనే చిత్రంతో తన కెరీర్‌ని ప్రారంభించింది. 

`ఆరెంజ్‌`, `నమో వెంకటేశాయా`, `మారో`, `జులాయి`, `సారోచ్చారు`, `నిప్పు`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`, `పడి పడి లేచే మనసు`, `సీత ఆన్‌ రోడ్‌`, `మా వింత గాధ వినుమా`, `హిట్‌`, `యశోద`, `అథర్వ` వంటి చిత్రాల్లో నటించింది. దీంతోపాటు పలు వెబ్‌ సిరీస్‌లు కూడా చేసింది.

హీరోయిన్లకి ఫ్రెండ్‌గా, హీరోలకు చెల్లిగా ఇలా పలు కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది కల్పిక. కొన్ని చిత్రాల్లో తానే లీడ్‌గానూ చేసింది. ఇలా నటిగా ఆకట్టుకుంటున్న ఆమె ఇప్పుడు వివాదంలో ఇరుక్కోవడం ఆశ్చర్యపరుస్తుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్