మహేష్‌ `ఖలేజా` సరికొత్త రికార్డు..`గబ్బర్‌ సింగ్‌` రికార్డులు బ్రేక్‌.. ఫస్ట్ డే కలెక్షన్లు

Published : May 31, 2025, 06:35 PM IST
gabbar singh, khaleja

సారాంశం

మహేష్‌ బాబు హీరోగా నటించిన `ఖలేజా` మూవీ శుక్రవారం రీ రిలీజ్‌ అయ్యింది. ఫస్ట్ డే కలెక్షన్లలో ఇది సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ సినిమాల ట్రెండ్‌ నడుస్తుంది. పెద్ద సినిమాలు లేకపోవడంతో వరుసగా క్లాసిక్‌ మూవీస్‌ ని, బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను రీ రిలీజ్‌ చేస్తున్నారు. దీంతో రీ రిలీజ్‌లో స్టార్‌ హీరోల సినిమాలు రచ్చ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మహేష్‌ బాబు `ఖలేజా` మూవీ సరికొత్త రికార్డుని  క్రియేట్‌ చేసింది.

రీ రిలీజ్‌లో మహేష్‌ బాబు `ఖలేజా` సంచలనం

సూపర్‌ స్టార్‌ కృష్ణ జయంతిని పురస్కరించుకుని మహేష్‌ బాబు నటించిన `ఖలేజా` చిత్రాన్ని రీ రిలీజ్‌ చేశారు. 4కే రిజల్యూషన్‌తో ఈ మూవీని శుక్రవారం ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చారు. 

అడ్వాన్స్ బుకింగ్స్ లోనే రికార్డులు క్రియేట్‌ చేసిన ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల పరంగానూ సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేసింది. రీ రిలీజ్‌ మూవీస్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా నిలిచింది.

`గబ్బర్‌ సింగ్‌` రికార్డు ని బ్రేక్‌ చేసిన మహేష్‌ బాబు `ఖలేజా`

మహేష్‌ బాబు `ఖలేజా` మూవీ మొదటి రోజు ఏకంగా రూ.8.26 కోట్ల గ్రాస్‌ని రాబట్టడం విశేషం. దీంతో ఈ మూవీ రీరిలీజ్‌ సినిమాలకు సంబంధించిన అన్ని రికార్డులను బ్రేక్‌ చేసింది. గతంలో రూ.6.75 కోట్లతో పవన్‌ కళ్యాణ్‌ `గబ్బర్‌ సింగ్‌` మూవీ టాప్‌లో ఉంది. 

ఇప్పటి వరకు రీ రిలీజ్‌లో అత్యధిక వసూళ్లని రాబట్టిన మూవీగా `గబ్బర్ సింగ్‌` నిలిచింది. ఆ రికార్డులను ఇప్పుడు మహేష్‌ బాబు `ఖలేజా` బ్రేక్‌ చేయడం విశేషం.

స్ట్రెయిట్‌ రిలీజ్‌లో ఫెయిల్‌ అయిన `ఖలేజా`

ఇదిలా ఉంటే `ఖలేజా` మూవీ 2010లో విడుదలైంది. స్ట్రెయిట్ రిలీజ్‌ టైమ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. విమర్శల ప్రశంసలందుకున్న ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.

 కానీ ఇప్పుడు స్ట్రెయిట్‌ రిలీజ్‌ కంటే రీ రిలీజ్‌లోనే అత్యధిక వసూళ్లని రాబట్టడం విశేషం. ఈ మూవీ శనివారం, ఆదివారం కూడా బాగానే రన్‌ అయ్యే అవకాశం ఉంది. 

ఈ లెక్కన ఇది సుమారు పదిహేను కోట్లకు పైగా వసూళ్లని రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమాని కొన్న నిర్మాతకి కాసుల వర్షం కురిపిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన రెండో చిత్రం `ఖలేజా`

ఇక మహేష్‌ బాబు, అనుష్క శెట్టి జంటగా నటించిన `ఖలేజా` చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకుడు. `అతడు` సినిమా తర్వాత మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన రెండో చిత్రమిది. 

ఈ మూవీని సింగనమల రమేష్‌ బాబు, సీ కళ్యాణ్‌, ఎస్‌ సత్యరామమూర్తి నిర్మించారు. రూ.32 కోట్లకు రూపొందిన ఈ మూవీ రూ.18కోట్లు వసూలు చేసింది. సగం నష్టాలను తెచ్చిపెట్టింది. కానీ ఇప్పుడు ఆరేడు రెట్లు లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?