2.0 కు పోటీగా భైరవ గీత.. రిస్క్ అవసరమా వర్మ?

By Prashanth MFirst Published Nov 18, 2018, 1:28 PM IST
Highlights

ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన భైరవగీత పోస్టర్స్ టీజర్స్ అండ్ ట్రైలర్ ఆడియెన్స్ ని ఒక్కసారిగా ఎట్రాక్ట్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగు కన్నడ తో పాటు తమిళ్ - హిందీలో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది.

ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన భైరవగీత పోస్టర్స్ టీజర్స్ అండ్ ట్రైలర్ ఆడియెన్స్ ని ఒక్కసారిగా ఎట్రాక్ట్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగు కన్నడ తో పాటు తమిళ్ - హిందీలో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా గత కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. 

అసలైతే నవంబర్ 22న సినిమాను విడుదల చేయనున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో మొన్నటివరకు తెగ హంగామా చేశాడు.  వర్మ సమర్పణలో  శిష్యుడు సిద్దార్థ్ సినిమాకు దర్శకత్వం వహించడంతో సినిమాపై మొదటి నుంచి అంచనాలు పెరుగుతున్నాయి. కన్నడ స్టార్ హీరో ధనంజయ ఇరా మోర్ ప్రధాన పాత్రల్లో నటించిన భైరవ గీత కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. 

శంకర్ దర్శకత్వం వహించిన 2.0 భారీ బడ్జెట్ చిత్రం ఈ నెల 29న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. రజినీకాంత్ - అక్షయ్ కుమార్ నటించిన ఆ విజువల్ వండర్ పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే భైరవగీత నవంబర్ 30న రానున్నట్లు 2.0తో పోటీ పడనున్నట్లు వర్మ సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నాడు. 

దీంతో సోషల్ మీడియాలో ఈ రిస్క్ అవసరమా అనే విధంగా కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ డేట్ పై అనేక అనుమానాలు వస్తోన్న సమయంలో శంకర్ లాంటి దర్శకుడి సినిమాకు పోటీగా భైరవగీతను దించడం నిజంగా ఒక పెద్ద ప్రయోగమే. మరి హై టెక్నీకల్ మూవీ ముందు ఈ గ్రామీణ ప్రేమ కథ ఎంతవరకు హిట్టవుతుందో చూడాలి. 

click me!
Last Updated Nov 18, 2018, 1:28 PM IST
click me!