నేను ఎప్పటికైనా సిద్దమే.. రూమర్స్ లెక్క తేల్చిన రకుల్!

Published : Nov 18, 2018, 12:31 PM IST
నేను ఎప్పటికైనా సిద్దమే.. రూమర్స్ లెక్క తేల్చిన రకుల్!

సారాంశం

గత ఏడాది వరకు టాలీవుడ్ లో తెగ బిజిగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య కొంచెం స్లో అయ్యిందనే టాక్ వైరల్ అవుతోంది. స్పైడర్ డిజాస్టర్ తరువాత రకుల్ కి అవకాశాలు తగ్గినట్లు వార్తలు కూడా వచ్చాయి. 

గత ఏడాది వరకు టాలీవుడ్ లో తెగ బిజిగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య కొంచెం స్లో అయ్యిందనే టాక్ వైరల్ అవుతోంది. స్పైడర్ డిజాస్టర్ తరువాత రకుల్ కి అవకాశాలు తగ్గినట్లు వార్తలు కూడా వచ్చాయి. దీంతో అమ్మడు పూర్తిగా కోలీవుడ్ బాలీవుడ్ చిత్రాలపైనే ఎక్కువగా ద్రుష్టి పెట్టినట్లు అర్ధమయ్యింది. 

అయితే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రూమర్స్ పై స్పందించింది. తెలుగు తెరకు కావాలనే దూరం పెడుతున్నట్లు అవకాశాలు వచ్చినా రకూల్ నో చెబుతున్నట్లు వస్తోన్న రూమర్స్ అని అబద్ధాలని తెగేసి చెప్పేసింది. టాలీవుడ్ నా హోమ్. ఇక్కడే కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా. నచ్చిన ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఇతర భాషల్లో కూడా నటిస్తున్న అని తెలిపింది. 

అదే విధంగా ఒక ఏడాదిలో అందరిలాగే తనకు కూడా 365రోజులే ఉన్నాయని ఇప్పుడు 7 సినిమాలతో బిజీగా ఉన్నట్లు చెబుతూ.. తెలుగులో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్న అని తెలిపింది. ఎన్టీఆర్ బయోపిక్ తో పాటు నాగచైతన్య ప్రాజెక్టులో కూడా నటిస్తున్నానని అంటూ తెలుగులో అవకాశం ఉన్న ప్రతిసారి నటించడానికి తాను ఎప్పటికైనా సిద్దమే అని రకూల్ వివరణ ఇచ్చింది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌