ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ వాయిస్.. క్రిష్ ప్రయోగం?

Published : Nov 18, 2018, 12:00 PM ISTUpdated : Nov 18, 2018, 12:03 PM IST
ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ వాయిస్.. క్రిష్ ప్రయోగం?

సారాంశం

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రాల్లో ఎన్టీఆర్ బయోపిక్ ఒకటి. ఈ సినిమా కోసం ఇతర పరిశ్రమల ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు. 

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రాల్లో ఎన్టీఆర్ బయోపిక్ ఒకటి. ఈ సినిమా కోసం ఇతర పరిశ్రమల ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు. తెలుగు సినిమా తెరకు కొత్త అర్ధం చెప్పి రాజకీయాల్లో ఊహించని మార్పులు తెచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. 

దర్శకుడు క్రిష్ సినిమా కోసం చాలా వరకు కొన్ని కొత్త టెక్నీక్స్ ను ఆచరణలో పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇక బాలయ్య తన తండ్రి పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అసలు విషయంలోకి వస్తే సినిమాలో కొన్ని పొలిటికల్ సీన్స్ కోసం ఎన్టీఆర్ ఒరిజినల్ వాయిస్ ని 'కాపీ -పేస్ట్' చేయనున్నారట. సన్నివేశాలు రియాలిస్టిక్ గా ఉండాలని దర్శకుడు ఏ మాత్రం తేడా రాకుండా ఎన్టీఆర్ ఒరిజినల్ వాయిస్ ను తీసుకొని ఈ ప్రయోగం చేస్తున్నట్లు సమాచారం. 

ఇక ప్రస్తుతం ఎండింగ్ దశలో ఉన్న ఈ సినిమా పాటలను ఒక్కొక్కటిగా త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సంక్రాంతికి మొదటి పార్ట్ ని రిలీజ్ చేసి ఒక 20 రోజుల అనంతరం మరొక భాగాన్ని విడుదల చేయాలనీ బాలయ్య ఆలోచిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌