Oscar awards 2025: నా కూతురు జీవితం చూస్తే భయమేస్తుంది.. `నో అదర్‌ ల్యాండ్‌` డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..

Published : Mar 03, 2025, 10:27 AM IST
Oscar awards 2025: నా కూతురు జీవితం చూస్తే భయమేస్తుంది.. `నో అదర్‌ ల్యాండ్‌` డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..

సారాంశం

Oscar awards 2025: `నో అదర్‌ ల్యాండ్‌` అనే డాక్యుమెంటరీని రూపొందించిన మేకర్స్ తమ జాతీని, దేశంలో జరుగుతున్న అన్యాయాలపై ఆస్కార్‌ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఆస్కార్‌ అవార్డుల వేడుక ఘనంగా ముగిసింది. ఈ సారి ఆస్కార్‌ అవార్డులు ఎవరు సొంతం చేసుకున్నారు? ఏ ఏ మూవీకి వచ్చాయో తెలిపోయింది. సామాజిక సంబంధాలు, దేశాల మధ్య సంబంధాలు, సామాజిక అసమానతలకు పెద్ద పీట వేసింది ఆస్కార్‌ జ్యూరీ. ఈ క్రమంలో ఆస్కార్‌ బెస్ట్ మూవీగా `అనోరా` ఆస్కార్‌ సొంతం చేసుకోగా, యాడ్రియన్‌ బ్రాడీ(ది బ్రూటలిస్ట్) ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ దక్కించుకున్నారు.

`అనోరా` నటి మైకీ మ్యాడిసన్‌ ఉత్తమ నటిగా ఆస్కార్‌ సాధించింది.  బెస్ట్ డైరెక్టర్‌గా `అనోరా` ఫేమ్‌ సీన్‌ బేకర్‌ ఆస్కార్‌ ని గెలుచుకున్నారు. అలాగే బెస్ట్ ఓరిజినల్‌ స్కోర్‌ విభాగంలో, ఎడిటింగ్‌లో సీన్‌ బేకర్‌ మరో రెండు ఆస్కార్‌ సాధించారు. మొత్తంగా `అనోరా` మూవీ ఆస్కార్‌లో సంచలనంగా సృష్టించింది. సీన్‌ బేకర్‌ ఒక్కరే నాలుగు అవార్డులను(బెస్ట్ ఫిల్మ్ తో కలిపి) సొంతం చేసుకోవడం విశేషం. 

సంచలనంగా `నో అదర్‌ ల్యాండ్‌` డాక్యుమెంటరీ ఫిల్మ్ డైరెక్టర్‌ కామెంట్స్..

దీంతోపాటు వరల్డ్ మోస్ట్ పాపులర్‌ మూవీ `డ్యూన్‌2`కి రెండు ఆస్కార్‌ లు దక్కాయి. మరోవైపు `ది బ్యూటలిస్ట్` మూవీకి మూడు ఆస్కార్‌లు వరించాయి. ఈ మూడు సినిమాల హవా ఆస్కార్‌లో స్పష్టంగా కనిపిస్తుంది.

ఇక సందేశం పరంగా, సామాజిక సమస్య పరంగా, ప్రపంచ యుద్ధం ఎంత ప్రమాదమో చెబుతూ రూపొందించిన `నో అదర్‌ ల్యాండ్‌` డాక్యుమెంటరీ ఫీచర ఫిల్మ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఇందులో దర్శకులు మాట్లాడిన మాటలు ఆలోచింప చేస్తున్నాయి. అందరి హృదయాలను కొల్లగొడుతున్నాయి. 

కూతురు జీవితాన్ని తలుచుకుంటే భయమేస్తుందని `నో అదర్‌ ల్యాండ్‌` డైరెక్టర్‌ కామెంట్‌ చేశారు..

`నో అదర్‌ ల్యాండ్‌` ప్రధానంగా ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని మసాఫర్‌ యట్టాలో పాలస్టీనియన్ల బలవంతపు పునరావాసాన్ని హైలైట్‌ చేస్తూ రూపొందించారు. పాలస్తీనియన్‌-ఇజ్రాయెల్‌ సమిషి కృషితో దీన్ని రూపొందించారు. ఆస్కార్‌ అందుకున్న సందర్భంగా కో డైరెక్టర్‌ బాసెల్‌ అడ్రా మాట్లాడుతూ ఎమోషనల్‌ కామెంట్‌ చేశారు.

తాను తండ్రి కావడం గురించి ఆలోచించి, పునరావాసం విషయంలో తన కుమార్తె జీవితం ఎంతటి భయానక, హింసాత్మకంగా ఉంటుందో ఆలోచిస్తుంటే భయమేస్తుంది అని అన్నారు. దీంతో ఆస్కార్‌ స్టేజ్‌ మొత్తం చప్పట్లతో దద్దరిల్లింది. 

పాలస్తీనా, ఇజ్రాయెల్‌లో స్వేచ్ఛ, సురక్షితమైన జీవితం కోసం `నో అదర్‌ ల్యాండ్‌` మేకర్స్ పిలుపు..

ఇంకా ఆయన మాట్లాడుతూ, నా తోటి పాలస్తీనియన్ల తరఫున మాట్లాడున్న. ఈ చిత్రం మనం చాలా ఏళ్లుగా భరించిన కఠినమైన వాస్తవికతను ప్రతిబింబిస్తుంది. పాలస్తీనా ప్రజలకు అన్యాయం, జాతి ప్రక్షాళనను ఆపడానికి తీవ్రమైన చర్య తీసుకోవాలని మేం ప్రపంచాన్ని కోరుతున్నాం అని వెల్లడించారు.

మరో దర్శకుడు మాట్లాడుతూ, శాంతి అవసరం ఉందని, దానికి మరో మార్గం ఉందని, రాజకీయ పరిష్కారం, జాతి ఆధిపత్యం లేకుండా, మన ఇద్దరికీ జాతీయ హక్కులు ఉండాలని, గాజాలో విధ్వంసం అంతం కావాలని, బందీలను విడుదల చేయాలని, పాలస్తీనియన్లు, ఇజ్రాయెల్‌ ప్రజలు ఇద్దరూ సురక్షితంగా, స్వేచ్ఛగా జీవించగల భవిష్యత్‌ ఏర్పాటు చేయాలని వారు కోరుకున్నారు. ఇది ఆస్కార్‌ ప్రముఖులను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం వీరి స్పీచ్‌ వైరల్‌ అవుతుంది. 

 read  more: Oscar 2025: విజేతల లిస్ట్ , భారతీయ చిత్రం ‘అనూజ’కి వచ్చిందా?

also read: Oscar Awards 2025: అమెరికా వలస వచ్చిన నటికి ఆస్కార్‌, జోయ్‌ సల్డానా ఎమోషనల్‌.. అమ్మమ్మ గర్వపడే రోజు

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

IMDB మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్.. టాప్ 20లో ఏ సినిమా కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారంటే?
నయనతార హీరోయిన్ గా ఒకే కథతో 3 సినిమాలు.. ముగ్గురు స్టార్ హీరోలు ఎవరు?