Oscar Awards 2025: అమెరికా వలస వచ్చిన నటికి ఆస్కార్‌, జోయ్‌ సల్డానా ఎమోషనల్‌.. అమ్మమ్మ గర్వపడే రోజు

Published : Mar 03, 2025, 08:19 AM IST
Oscar Awards 2025: అమెరికా వలస వచ్చిన నటికి ఆస్కార్‌, జోయ్‌ సల్డానా ఎమోషనల్‌.. అమ్మమ్మ గర్వపడే రోజు

సారాంశం

2025 అకాడమీ అవార్డులు ప్రకటించారు. ఈ సారి కంటెంట్‌కి ప్రయారిటీ ఇచ్చారు. అదే ఉత్తమ సహాయనటిగా అవార్డు గెలుచుకున్న జోయ్‌ సల్డానా ఎమోషనల్‌ అయ్యారు.   

ఆస్కార్‌ అవార్డులు.. ప్రపంచ సినీప్రియులు ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారాలు. సినిమాకి చెందిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్, టెక్నీషియన్ల అల్టీమేట్‌ డ్రీమ్‌ ఆస్కార్‌. రెండేళ్ల క్రితం మన ఇండియన్‌ మూవీకి ఆస్కార్‌ వరించిన విషయం తెలిసిందే. `ఆర్‌ఆర్‌ఆర్‌` మూవీలోని `నాటు నాటు` సాంగ్‌కి ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌ అవార్డు వరించింది. ఆస్కార్‌ పొందిన తొలి ఇండియన్‌ ఫీచర్‌ ఫిల్మ్ గా `ఆర్‌ఆర్‌ఆర్‌` చరిత్ర సృష్టించింది. అయితే టెక్నీషియన్ల పరంగా రెహ్మాన్‌కి ఆస్కార్‌ వరించింది. పలు డాక్యుమెంటరీ ఫిల్మ్స్ కూడా ఈ ఆస్కార్‌ దక్కింది. 

ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డులు 2025 ప్రకటన జరిగింది. ఈ సారి ఊహించని సినిమాలకు, ఆర్టిస్టు లకు అవార్డులు వరిస్తున్నాయి. కంటెంట్‌కి పెద్ద పీఠ వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో ఉత్తమ సహాయ నటి జోయా సాల్దానా(ఎమిలియో పెరెజ్‌) ఆస్కార్‌ గెలుచుకుంది. ఆమె అమెరికాకి వలస వచ్చిన నటి కావడం విశేషం. ఆస్కార్‌ గెలుచుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 1961లో తన అమ్మమ్మ అమెరికాకి వలస వచ్చినట్టు తెలిపారు. తానుస్పానిష్‌లో పాే, మాట్లాడే పాత్రకు ఆస్కార గెలవడం చూసి అమ్మమ్మగర్వపడుతుందని తెలిపింది. 

`నేు కలల, గౌరవం, కష్టపడి పని చేసే చేతులు కలిగిన వలస తల్లిదండ్రులు గర్వించదగ్గ బిడ్డను`అంటూ ఆమె ఎమోషనల్‌ కామెంట్‌ చేశారు. ఈవెంట్‌ మొత్తాన్ని భావోద్వేగానికి గురి చేశారు. ఈసందర్భంగా జోయ్‌ తన భర్తకి థ్యాంక్స్ చెప్పిన తీరు అదిరిపోయింది. ఇక ఆస్కార్‌ అవార్డులకు సంబంధించిన వివిధ విభాగాల నుంచి ఆస్కార్‌లు ప్రకటిస్తున్నారు. ఆ లిస్ట్ ఓ సారి చూద్దాం. 

ఉత్తమ సహాయ నటుడు : కీరన్ కల్కిన్ ( ఏ రియల్ పెయిన్)
ఉత్తమ సహాయనటి : జో సాల్దానా (ఎమిలియా పెరెజ్ చిత్రానికి గానూ)
అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : కాన్ క్లేవ్
ఒరిజినల్ స్క్రీన్ ప్లే : అనోరా
యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ : ఫ్లో
బెస్ట్ యానిమెటెడ్ షార్ట్ ఫిల్మ్ : ఇన్ ది షాడో ఆఫ్ సైప్రెస్
క్యాస్టూమ్ డిజైనర్ : పాల్ తాజేవెల్ (విక్డ్)
ఉత్తమ ఎడిటింగ్ : సీన్ బీకర్ (అనోరా)
మేకప్, హెయిర్ స్టైలింగ్ : పియర్ ఒలివియర్ పర్సిన్, స్టీఫెన్ గులియన్, మారిలిన్ స్కార్సెల్లి (ది సబ్ స్టాన్స్ చిత్రానికి గానూ)
ఒరిజినల్ సాంగ్ : ఎల్ మల్ (ఎమిలియా పెరెజ్)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైనింగ్ : విక్డ్
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ : నో అదర్ ల్యాండ్
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Prabhas: దేశముదురు దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన ప్రభాస్ సినిమా..ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్
Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?