పునీత్‌ రాజ్‌ కుమార్‌, కన్నడ కంఠీరవ రాజ్‌ కుమార్‌ అలాంటి వాళ్లా? సీనియర్‌ నటి షాకింగ్‌ కామెంట్స్

Published : Mar 03, 2025, 06:10 AM IST
పునీత్‌ రాజ్‌ కుమార్‌, కన్నడ కంఠీరవ రాజ్‌ కుమార్‌ అలాంటి వాళ్లా? సీనియర్‌ నటి షాకింగ్‌ కామెంట్స్

సారాంశం

కన్నడ కంఠీరవ రాజ్‌ కుమార్‌, ఆయన కొడుకు పునీత్‌ రాజ్‌కుమార్‌లపై సీనియర్‌ నటి లక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి గురించి షాకింగ్‌ విషయాలను వెల్లడించింది. 

సీనియర్ నటి లక్ష్మి (Julie Lakshmi) కంఠీరవ డాక్టర్ రాజ్‌కుమార్ (Dr Rajkumar) , ఆయన కొడుకు పునీత్‌ రాజ్‌కుమార్‌(అప్పు -Appu) గురించి షాకింగ్‌ కామెంట్స్ చేశారు.  డాక్టర్ రాజ్‌కుమార్‌తో లక్ష్మి 15 కంటే ఎక్కువ చిత్రాల్లో నటించారు. డాక్టర్ రాక్‌కుమార్, లక్ష్మి జోడీ నటించిన ఎన్నో చిత్రాలను కన్నడ ఆడియెన్స్ ఆదరించారు. బ్రహ్మరథం పట్టారు. వారిద్దరి జోడీని మెచ్చుకున్నారు.

రాజ్‌కుమార్‌తో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో భాగమైన సీనియర్‌ నటి లక్ష్మి..

ఈ నేపథ్యంలో డాక్టర్ రాజ్‌కుమార్ గురించి లక్ష్మి చెప్పిన విషయం ఇప్పుడు ఆశ్చర్యపరుస్తుంది. ఆయనే కాదు, పునీత్‌ రాజ్‌ కుమార్‌ గురించి కూడా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే విషయాలను బయటపెట్టారు.  తండ్రీకొడుకు ఇద్దరి సినిమాల్లోనూ లక్ష్మి నటించారు. డాక్టర్ రాజ్‌కుమార్‌తో `నా నిన్న మರೆಯలారే`, `గోవా సీఐడీ 999`, `ఒలవు గెలువు `ఇలా వరుస చిత్రాల్లో లక్ష్మి నటించారు.

రాజ్‌ కుమార్‌ దేవుడులాంటి మనిషి అంటూ లక్ష్మి కామెంట్‌ చేశారు..

ఇక, పునీత్ రాజ్‌కుమార్‌తో 'వంశీ' చిత్రంలో నటించారు.  ఈ ఇద్దరి గురించి నటి లక్ష్మి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. డాక్టర్ రాజ్‌కుమార్ గురించి 'కొందరు దేవతలు భూమికి వచ్చి వెళ్తారని అంటారు. కానీ రాజ్‌కుమార్ గురించి చెప్పాలంటే ఆయన నిజంగా ఒక మనిషి.

read  more: కృష్ణ, కృష్ణంరాజు ఇద్దరికీ సంక్రాంతి రోజున కోలుకోలేని దెబ్బ, టాలీవుడ్ చరిత్రలో కనీవినీ ఎరుగని విచిత్రం

సాధారణంగా మనుషులకు కోపం-తాపం అన్నీ వస్తాయి.. కానీ ఆయన ఒక రకంగా దేవుడిలాంటి మనిషి, పర్ఫెక్ట్ మనిషి' అన్నారు. అంతే కాదు, 'నేను చాలాసార్లు ఆయనకు కోపం తెప్పించాలని ఏదో ఒకటి చెబుతూ ఉండేదాన్ని.. నేను ఏం చెప్పినా ఆయనకు కోపం వచ్చేది కాదు.

పైగా, నాతో 'నాకు కోపం తెప్పించాలనే కదా ఏదో ఒకటి చెబుతారు..? అని నవ్వుతూ నవ్వుతూ అనేవారు. ఎప్పుడూ ఆయన కోపం తెచ్చుకోలేదు. నాకే చాలాసార్లు తర్వాత బాధగా ఉండేది' అన్నారు నటి జూలీ లక్ష్మి. 

పునీత్‌ రాజ్‌ కుమార్‌ ఒక పుణ్యాత్ముడు అని సీనియర్‌ నటి లక్ష్మి వ్యాఖ్యానించారు..

ఇంకా, నటి లక్ష్మి పునీత్ గురించి ఏమన్నారంటే.. 'ఆయన ఒక పుణ్యాత్ముడు.. ఇక్కడకు వచ్చి ఏదో మంచి చేసి తొందరగా తిరిగి వెళ్లాల్సి ఉంది ఆయనకు.. అలాగే చేశారు.. అందుకే ఆయన పెద్ద ఇంట్లో పుట్టారు. నేను ఆ బిడ్డను కడుపులో ఉండగానే చూశాను.. అంటే, పార్వతి అమ్మ పునీత్‌కు గర్భవతిగా ఉన్నప్పుడు నేను మరియు డాక్టర్ రాజ్‌కుమార్ 'ఒలవు గెలువు' షూటింగ్ చేస్తున్నాం. ఆ తర్వాత అదే చిన్న అబ్బాయితో నేను నటించాను కూడా' అన్నారు నటి లక్ష్మి.

read  more: నయనతార, రష్మిక, అనుష్క, త్రిషలకు సాయిపల్లవి ఝలక్‌, `రామాయణ్‌`కి ఆమె తీసుకునే పారితోషికం తెలిస్తే ఫ్యూజులు ఔట్

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే
Prabhas: దేశముదురు దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన ప్రభాస్ సినిమా..ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్