
సింగర్ రూపాంకర్ బాఘ్చి పేస్ బుక్ లైవ్ సెషన్ లో సింగర్ కెకె(Singer KK) పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సింగర్ కెకెను ఉద్దేశిస్తూ రూపాంకర్.... బెంగాల్ లో కెకె కంటే గొప్ప సింగర్ ఉన్నారు. అతనికి అంత హైప్ ఎందుకు? అసలు ఎవరు ఈ కెకె.. అంటూ అవమానకర వ్యాఖ్యలు చేశారు. రూపాంకర్ కామెంట్స్ సంచలనంగా కాగా బెంగాలీ నటి రూపాంజన మిత్ర ఫైర్ అయ్యారు. ఓ రేంజ్ లో రూపాంకర్ పై దాడికి దిగారు.
నటి తన సోషల్ మీడియా పోస్ట్స్ లో... నీకు సిగ్గుందా, నువ్వు ఓ స్వార్ధపరుడివి. సింగర్ కెకెతో నిన్ను పోల్చుకునే ముందు నీ సంకుచిత మనస్తత్వాన్ని సరిచేసుకో. ఆయన్ని తక్కువ చేసి మాట్లాడే హక్కు నీకు లేదు. నేను ఆయన అభిమానిని, నీ మాటలు నన్ను ఎంతగానో బాధపెట్టాయి, అని ఆమె (Rupanjana Mitra) రాసుకొచ్చారు. రూపాంకర్ వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా సోషల్ మీడియాలో అతన్ని జనాలు ఏకి పారేస్తున్నారు. నెటిజెన్స్ రూపాంకర్ ని భారీగా ట్రోల్ చేస్తున్నారు.
ఇక తన వ్యాఖ్యలపై రూపాంకర్ (Rupankar bagchi) వివరణ ఇవ్వడం జరిగింది. కెకె మరణవార్త తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన గురించి నేను చేసిన కామెంట్స్ తప్పుగా వెళ్లాయి అంటూ వీడియో సందేశంలో వెల్లడించారు.
మే 31 మంగళవారం సింగర్ కెకె మరణించిన విషయం తెలిసిందే. కలకత్తాలో లైవ్ షో ముగిసిన తర్వాత ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయన స్టే చేసిన హోటల్ లో ఈ సంఘటన చోటు చేసుకోగా దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఇక కెకె మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయనది సహజమరణం కాదని పలువురు ఆరోపిస్తున్నారు.