
అఖండ తరువాత బాలయ్య జోరు మామూలుగా లేదు. రీసెంట్ గా 175 డేస్ ను కంప్లీట్ చేసుకుని, రికార్డ్స్ మీద రికార్డ్స్ తిరగ రాసిన అఖండ ఇచ్చిన జోష్ తో ఇంకా రెచ్చిపోతున్నాడు నటసింహం. వరుసగా సినిమాలు సెట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఒకదాని వెంట మరొక సినిమాను సెట్స్ ఎక్కించేస్తున్నాడు బాలయ్య బాబు.
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలోనే నడిచే కథతో ఊరమాస్ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ కంప్లీట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా శ్రుతి హాసన్ అలరించనుంది. ఈ దసరా పండుగకి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
ఆ తరువాత సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన చేయనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణను మరింత డిఫరెంట్ గా చూపిస్తానని అనిల్ రావిపూడి ఈ మధ్యే చెప్పాడు. అనిల్ ఈమాట చెప్పడంతో సినిమా స్టార్ట్ కాకముందే.. అందరిలో ఆసక్తిని పెరిగిపోయింది. ఇక ఆ తరువాత సినిమా విషయంలో కూడా బాలయ్య ఓ నిర్ణయం తీసుకున్నట్ట టాలీవుడ్ సర్కిల్ లో టాక్ వినిపిస్తుంది.
అనిల్ రావిపూడి తరువాత బాలకృష్ణ ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయంపే బాలయ్య అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తికర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొంత మంది పేర్లు వినిపిస్తుండగా.. అందులో ముఖ్యంగా బీవీఎస్ రవి పేరు ముందు వరుసలో ఉంది.
రచయితగా బీవీఎస్ రవికి మంచి పేరు ఉంది. ఆయాన పనిచేసిన చేసిన చాలా సినిమాలు విజయాలను అందుకున్నాయి. కాకపోతే ఆయన డైరెక్ట్ చేసిన వాంటెడ్, జవాన్ రెండు సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. ఆయన వినిపించిన కథకి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. బాలయ్య చేసిన అన్ స్టాపబుల్ ను డిజైన్ చేసింది బీవీఎస్ రవినే. ఆ పరిచయంతోనే బాలయ్య ఛాన్స్ ఇచ్చాడనే టాక్ కూడా వినిపిస్తోంది.
అయితే బాలయ్యతో సినిమా చేసి.. రవి సక్సెస్ సాధించగలడా..? బాలకృష్ణ అనవసరంగా రిస్క్ చేస్తున్నాడా అనే అభిప్రాయం సినీ వర్గాల నుంచి వ్యాక్తం అవుతుంది. ఫ్యాన్స్ మాత్రం బాలయ్య ఏం చేసినా.. దానికి ఫుల్ సపోర్ట్ ఇస్తామంటున్నారు. మరి ఫైనల్ గా బాలకృష్ణ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి మరి.