
కొద్దిరోజుల క్రితం బోయ సునీత గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద నగ్నంగా కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అక్కడి సిబ్బంది ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరచగా, కుటుంబ సభ్యులకు అప్పగించాలని జడ్జి పోలీస్ అధికారులను ఆదేశించారు.
రెండు వారాలు గడవకముందే మళ్లీ ఆమె అదే కార్యాలయం ముందు బైఠాయించి గేటుకు వేలాడుతూ నిరసన వ్యక్తం చేసింది. గీతా ఆర్ట్స్ కార్యాలయం ప్రతినిధులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా వినకుండా గేటు ముందే పడుకుంది. జూబ్లీహిల్స్ పోలీసులను మూడు గంటల పాటు ముప్పుతిప్పలు పెట్టింది. ఇప్పటి వరకు ఆమె ఇదే కార్యాలయం ముందు పాతిక సార్లు ఆందోళన చేయగా రెండుసార్లు ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి తరలించారు.
కొన్నాళ్లుగా నిర్మాత బన్నీ వాసుపై ఆమె ఆరోపణలు చేస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని నన్ను లైంగికంగా వాడుకొని మోసం చేసాడనేది ఆమె ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలో పలుమార్లు నిరసనలకు దిగారు. బన్నీ వాసు టీమ్ ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. ఆమె మానసిక స్థితి సరిగా లేదని, ఈ క్రమంలోనే బన్నీ వాసుపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నారు. బోయ సునీత మాత్రం తరచుగా గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద నిరసనకు దిగుతున్నారు.