
బెల్లంకొండ వారసుడు సాయి శ్రీనివాస్ సరికొత్త అవతారంలో కనిపించడానికి సిద్దమవుతున్నాడు. గత కొంత కాలంగా తీరిక లేకుండా వేగంగా సినిమాలు చేస్తోన్న ఈ యువ హీరో కనీసం యావరేజ్ హిట్ కూడా అందుకోవడం లేదు. మళ్ళీ చేసేవన్నీ భారీ బడ్జెట్ సినిమాలే.. కానీ మినిమమ్ హిట్స్ లేకపోవడంతో డబ్బంతా బూడిదలో పోసినా పన్నీరులా అయిపోతోంది.
ఇక ఎలాగైనా ఈసారి ఒక బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని తన యాక్షన్ స్టామినాకు సస్పెన్స్ థ్రిల్లర్ కథను యాడ్ చేసుకుంటున్నాడు. తమిళ్ లో ఘనవిజయం సాధించిన రాట్ససన్ సినిమాను తెలుగులో రాక్షసుడు అనే టైటిల్ తో రిమేక్ చేస్తున్నాడు. ఫస్ట్ లుక్ రేపు విడుదల చేయబోతున్నారు.
ఈ సినిమాకు కూడా 20 కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నట్లు టాక్. అదే విధంగా ఈ సినిమాలో కథానాయకుడిగా సరికొత్తగా కనిపించేందుకు బెల్లంకొండ ట్రై చేస్తున్నట్లు సమాచారం. షూటింగ్ ను వీలైనంత త్వరగా ఫినిష్ చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్రణాళికలు రచిస్తోంది.