జనసేన కోసం రాలేకపోయా.. కానీ: అల్లు అర్జున్

Published : Apr 05, 2019, 08:10 PM IST
జనసేన కోసం రాలేకపోయా.. కానీ: అల్లు అర్జున్

సారాంశం

టాలీవుడ్ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ జనసేనకు మద్దతు పలుకుతూ అధికారిక లేఖను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ - నాగబాబు రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ తన అభిప్రాయాన్ని వివరించారు.

టాలీవుడ్ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ జనసేనకు మద్దతు పలుకుతూ అధికారిక లేఖను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ - నాగబాబు రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ తన అభిప్రాయాన్ని వివరించారు. మా మద్దతు ఎప్పుడు మీకే అంటూ ఎన్నికల ప్రచారంలో మేము లేకపోయినా.. సమాజ అభివృద్ధికి మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. 

అదే విధంగా రాజకీయాలలో జనసేన పార్టీ ఘన విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెబుతూ.. మంచి చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన నాగబాబు గారికి శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. 

పవన్ కళ్యాణ్ గురించి వివరణ ఇస్తూ.. పాలిటిక్స్ లో విజయవంతంగా అడుగులువేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఆయనకు మద్దతుగా ఉన్న వారందరికీ నా అభినందనలు. పవన్ కళ్యాణ్ గారు తన సరికొత్త విజన్ తో ఏపీ ప్రజల జీవితాల్లో సరికొత్త కాంతిని తీసుకువస్తారని ఆశిస్తున్నట్లు బన్నీ పేర్కొన్నారు. 

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి అలాగే విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీచేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి నాగబాబు పోటీ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి
IMDb రేటింగ్ ప్రకారం 2025 లో టాప్ 10 సినిమాలు, సౌత్ సినిమాల ముందు తలవంచిన బాలీవుడ్