
ఎన్టీఆర్ తో లవకుశ తీసిన బాబీ దర్శకత్వంలో వెంకటేశ్ .. నాగచైతన్య హీరోలుగా రూపొందుతున్న చిత్రం 'వెంకీమామ'. ఈ ఇద్దరి పాత్రలను బాబీ చాలా వైవిధ్యభరితంగా మలిచారాని మరో ఎఫ్ 2 లాంటి హిట్ వెంకటేష్ కొట్టబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.
ఇక ఉగాది సందర్భంగా ఈ మూవీ టైటిల్ లోగోను కాసేపటిక్రితమే విడుదల చేసింది చిత్రయూనిట్. రాశి చక్రంలో 'వెంకీ' అనేది ఆంగ్ల అక్షరాలతో .. 'మామ' అనేది తెలుగు అక్షరాల్లో డిజైన్ చేశారు. పోస్టర్లో ఒక వైపున పల్లెటూరు .. మరో వైపున యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇక టైటిల్ లోగోని డీకోడ్ చేస్తే...ఇది జ్యోతిష్యాలు, జాతకాలు చుట్టూ తిరిగే కథ అని అర్దమవుతోంది.
చైతూ చిన్నప్పుడే జాతకం చూపిస్తే మేనమాన గండం ఉందని తెలిసి...ఇద్దరినీ వేరు చేస్తారని, అక్కడనుంచి పెద్దయ్యాక మేనమామ తన మేనల్లుడు కోసం చేసే జర్ని ఆసక్తికరంగా ఉంటుందని, ఆ తర్వాత వాళ్లిద్దరూ కలిసాక..జాతకంలో చెప్పినట్లు జరుగుతుందా లేదా అన్నది ఇంట్రస్టింగ్ పాయింట్ అని చెప్తున్నారు.
ఈ సినిమాలో వెంకటేశ్ సరసన పాయల్ రాజ్ పుత్ .. చైతూ జోడీగా రాశి ఖన్నా నటిస్తున్నారు. రీసెంట్ గా రాజమండ్రిలో ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. తదుపరి షెడ్యూల్ ను ఈ నెల 8వ తేదీ నుంచి ప్లాన్ చేశారు.
తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటారు. ఆగస్టు నాటికి ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేసి, దసరా పండుగకి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.