ఏనుగుపై కూర్చున్న హీరో.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

Published : Sep 25, 2018, 12:39 PM IST
ఏనుగుపై కూర్చున్న హీరో.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

సారాంశం

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ థాయ్ లాండ్ లో జరుగుతోంది. అయితే అక్కడ బెల్లంకొండ ఓ ఏనుగు దంతాలపై కూర్చొని ఫోటోకి ఫోజిచ్చాడు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ థాయ్ లాండ్ లో జరుగుతోంది. అయితే అక్కడ బెల్లంకొండ ఓ ఏనుగు దంతాలపై కూర్చొని ఫోటోకి ఫోజిచ్చాడు.

ఆ ఫోటోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే.. అది కాస్త వివాదానికి తెరలేపింది. బెల్లంకొండ చేసిన పనికి ముఖ్యంగా ఏనుగు దంతాలపై కూర్చొని ఫోటో తీసుకోవడాన్ని జంతు ప్రేమికులు వ్యతిరేకిస్తున్నారు.

ఈ హీరో అలా చేయడం జీవ హింస కిందే వస్తుందని అతడిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇది గ్రహించిన బెల్లంకొండ శ్రీనివాస్ వెంటనే తన ఖాతా నుండి ఫోటోని తొలగించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. కెరీర్ పరంగా భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తోన్న సాయి శ్రీనివాస్ కి ఇప్పటివరకు చెప్పుకునే స్థాయిలో విజయం దక్కలేదు.

ఎన్నో ఆశలు పెట్టుకొని నటించిన 'సాక్ష్యం' సినిమా కూడా దెబ్బ కొట్టడంతో ప్రస్తుతం తేజ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో ముఖ్య పాత్రలో మెహ్రీన్ కనిపించనుంది. 

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి