భర్తకు కాజోల్ వార్నింగ్!

Published : Sep 25, 2018, 11:31 AM IST
భర్తకు కాజోల్ వార్నింగ్!

సారాంశం

బాలీవుడ్ నటి కాజోల్ తన భర్త అజయ్ దేవగన్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. దానికి కారణం అతడు చేసిన పనే.. అజయ్ తన భార్య విదేశాల్లో ఉందని, ఆమెతో మాట్లాడాలనుకుంటే ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి అంటూ ట్వీట్ చేశాడు. 

కొద్దిసేపటికే ఈ ట్వీట్ వైరల్ అయింది. చాలా మంది అభిమానులు కాజోల్ నెంబర్ కి మెసేజ్ లు పెట్టి ఆమె రిప్లయ్ కోసం ఎదురుచూస్తున్నట్లు అజయ్ స్క్రీన్ షాట్స్ తో సహా పోస్ట్ చేశారు. అజయ్ తన భార్య నెంబర్ ఎందుకు షేర్ చేశారనే విషయం ఎవరికీ అర్ధం కాలేదు.

ఈ విషయంపై స్పందించిన అజయ్.. తను ప్రాంక్ చేసినట్లు చెప్పారు. ''సెట్స్ లో ప్రాంక్స్ చేసి బోర్ కొట్టింది అందుకే కొత్తగా మీతో ప్రాంక్ ప్లే చేశాను'' అంటూ అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన కాజోల్.. ''ఇప్పుడు మీ ప్రాంక్స్ స్టూడియోను దాటి వెళ్లాయి. కానీ ఇలాంటి వేషాలు ఇంట్లో కుదరవు'' అంటూ కోపంగా ఉన్న ఎమోజీని పోస్ట్ చేశారు. 

సంబంధిత వార్త.. 

భార్య వాట్సాప్ నంబర్ షేర్ చేసిన హీరో!

PREV
click me!

Recommended Stories

Age Gap: మన స్టార్ హీరోలకు వారి భార్యల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం.. గాయని జానకి కుమారుడు కన్నుమూత, కారణం ఏంటి?