‘ఛత్రపతి’ రీమేక్ అందుకే చేస్తున్నా

By Surya PrakashFirst Published Dec 6, 2020, 11:49 AM IST
Highlights

ఇంతకుముందు చాలా ఆఫర్స్‌ వచ్చినప్పటికీ నాకు సరిపడే స్ర్కిప్ట్‌ దొరకలేదు. ‘ఛత్రపతి’ కథ నాకు సరిపోతుందని అనుకుంటున్నా. ఒరిజినల్‌ వెర్షన్‌లో ప్రభాస్‌ పోషించిన పాత్రను రీక్రియేట్‌ చేయడానికి భయపడడం లేదు. అలాగే బాలీవుడ్‌కు చెందిన ఎక్కువమంది ప్రేక్షకులు ఒరిజినల్‌ చిత్రాన్ని చూడలేదు..ప్రభాస్‌ పోషించిన పాత్రలో నటించడాన్ని ఓ గొప్ప బాధ్యతగా భావిస్తున్నా’ అన్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్‌ తాజాగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యిన సంగతి తెలిసిందే.  రాజమౌళి-యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘ఛత్రపతి’ రీమేక్‌తో శ్రీనివాస్‌ హీరోగా బాలీవుడ్‌కి పరిచయం కానున్నారు. బాలీవుడ్‌లో తెరకెక్కనున్న ‘ఛత్రపతి’ సినిమాకి వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించనున్నట్లు చిత్ర టీమ్ అధికారికంగా ప్రకటించింది. రీమేక్‌లు తెరకెక్కించడంలో వి.వి.వినాయక్‌ ఎంతో నైపుణ్యం కనబరుస్తారని.. ‘ఖైదీ నం150’తో అది మరోసారి నిరూపితమైందని.. ‘ఛత్రపతి’కి ఆయనే కరెక్ట్‌ అని భావించినట్లు చిత్రటీమ్ వెల్లడించింది. అయితే ప్రభాస్ చేసిన పాత్రను హిందీలో అంతేబాగా చేయగలరా అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి. ఈ విషయమై ఆయన్ని మీడియా పలకరించింది. 
   
బెల్లంకొండ శ్రీను మాట్లాడుతూ...‘నేను ఇప్పటివరకూ ఏడు సినిమాల్లో నటించాను. వాటిల్లో ఆరు చిత్రాలు(హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌) యూట్యూబ్‌లో 200 మిలియన్లకు పైగా వ్యూ‌స్‌ సాధించాయి. సినిమాల వల్ల ముంబయి, దిల్లీ ప్రాంతాల్లో ప్రజలు నన్ను గుర్తుపడుతున్నారు. అది నాకెంతో సంతోషంగా అనిపించింది. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఇదే సరైన సమయం అనుకుంటున్నా. ఇంతకుముందు చాలా ఆఫర్స్‌ వచ్చినప్పటికీ నాకు సరిపడే స్ర్కిప్ట్‌ దొరకలేదు. ‘ఛత్రపతి’ కథ నాకు సరిపోతుందని అనుకుంటున్నా. ఒరిజినల్‌ వెర్షన్‌లో ప్రభాస్‌ పోషించిన పాత్రను రీక్రియేట్‌ చేయడానికి భయపడడం లేదు. అలాగే బాలీవుడ్‌కు చెందిన ఎక్కువమంది ప్రేక్షకులు ఒరిజినల్‌ చిత్రాన్ని చూడలేదు..ప్రభాస్‌ పోషించిన పాత్రలో నటించడాన్ని ఓ గొప్ప బాధ్యతగా భావిస్తున్నా’ అన్నారు.
 
అలాగే ‘దశాబ్దం క్రితం తెరకెక్కించినప్పటికీ ‘ఛత్రపతి’ చిత్రాన్ని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. అయితే మేము ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఆధారంగా చేసుకుని అందరికీ చేరువయ్యేలా స్ర్కిప్ట్‌లో మార్పులు చేశాం. కెరీర్‌పరంగా నేను తీసుకున్న అదిపెద్ద నిర్ణయం ఇదే.. ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా.’ అని బెల్లంకొండ శ్రీనివాస్‌ వివరించారు. ‘అల్లుడు శీను’తో ఆయన్ని  హీరోగా తెలుగు తెరకు పరిచయం చేసిన వి.వి.వినాయక్‌.. ‘ఛత్రపతి’ బాలీవుడ్‌ రీమేక్‌కు దర్శకత్వం వహించనున్నారు.

‘సీత’ చిత్రం తర్వాత శ్రీనివాస్‌ తెలుగులో నటిస్తున్న చిత్రం ‘అల్లుడు అదుర్స్‌’. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నభా నటేశ్‌, అనుఇమ్మాన్యుయేల్‌  హీరోయిన్స్ గా కనిపించనున్నారు. నటుడు సోనూసూద్‌ ఓ కీలకపాత్రలో మెప్పించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. 

click me!