‘ఇలాంటి రాక్షసప్రభువు వంటి పాత్ర చేయటం ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా ఉంటాయి. కానీ, సీతని అపహరించినందుకు, రామునితో యుద్దానికి దారి తీసిన పరిస్థితులను, తన చెల్లి శూర్పణఖ విషయంలో లక్ష్మణుడు చేసిన పనికి ప్రతీకారం తీసుకునేందుకు.. వీటన్నింటికీ న్యాయం చేస్తూ ఎంటర్‌టైనింగ్‌గా మనిషిగా చూపించే ప్రయత్నం చేశారు’.అని మొదటిసారిగా ఈ చిత్రంలోని తన పాత్ర గురించి సైఫ్ తెలిపారు.
7 వేల ఏళ్ల నాటి రామాయణ ఇతిహాసం ఆధారంగా తీయనున్న ఆదిపురుష్ సినిమాలో రాముడిగా ప్రభాస్ కనిపించనున్న సంగతి తెలిసిందే. అదే విధంగా... ప్రభాస్ కు విలన్ గా రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ యాక్ట్ చేయనున్నాడు. ఈ విషయాన్ని చిత్ర టీమ్ ఇప్పటికే స్పష్టం చేసింది. 7 వేల ఏళ్ల కింద ప్రపంచంలో అత్యంత తెలివైన రాక్షసుడు ఉండేవాడు అంటూ ఈ సినిమాను నిర్మిస్తున్న టీ సిరీస్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి విషయం తేల్చేసింది. ఇక లంకేశ్వరుడు రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించనున్నాడు అనగానే కొన్ని వర్గాల నుంచి సోషల్ మీడియాలో వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాత అదీ సమిసిపోయింది. అయితే ఇప్పుడు మరో వివాదానికి ఈ తెర తీయబోతోందని అనిపిస్తోంది. అందుకు సైఫ్ అలీ ఖాన్ రీసెంట్ గా ఓ ఇంటర్వూలో చెప్పిన మాటలే.
‘ఇలాంటి రాక్షసప్రభువు వంటి పాత్ర చేయటం ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా ఉంటాయి. కానీ, సీతని అపహరించినందుకు, రామునితో యుద్దానికి దారి తీసిన పరిస్థితులను, తన చెల్లి శూర్పణఖ విషయంలో లక్ష్మణుడు చేసిన పనికి ప్రతీకారం తీసుకునేందుకు.. వీటన్నింటికీ న్యాయం చేస్తూ ఎంటర్‌టైనింగ్‌గా మనిషిగా చూపించే ప్రయత్నం చేశారు’.అని మొదటిసారిగా ఈ చిత్రంలోని తన పాత్ర గురించి సైఫ్ తెలిపారు.
సైఫ్ మాటలని బట్టి అర్దం అయ్యిందేమిటంటే..ఇప్పటి వరకు వచ్చిన ప్రతి సినిమాలోనూ రావణుడిని క్రూరిడిగా, దుర్మార్గుడిగా చాలా పెద్ద విలన్‌గా చిత్రీకరించి చెబుతారు. అంతేకాకుండా రావణుడు అంటే భారీ కాయంతో, ఎంతో క్రూరంగా కనిపించేలా చూపిస్తారు. కానీ ఈ సినిమాలో మాత్రం రావణుడిలోని మంచితనాన్ని చూపనున్నారట. అంతేకాకుండా ఈ సినిమా ద్వారా దర్వకుడు ప్రజలకు మరో కొత్త రామాయణాన్ని చూపించనున్నారని సైఫ్ చెప్పాడు.
ఈ చిత్రంలో కృతి సనన్ ‘సీత’ పాత్రలో నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే ‘అవతార్’, ‘స్టార్ వార్స్’ చిత్రాల వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్స్‌తో ఈ చిత్రానికి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ గురించి సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. గ్రీన్ మ్యాట్ టెక్నాలజీపై ఈ చిత్ర నిర్మాణం జరగనుంది. ఈ చిత్రాన్ని వివిధ భాషల్లో ఆగస్టు 11న, 2022లో విడుదల చేయనున్నారు.