గర్బవతిగా సాయిపల్లవి.. లెస్బియన్‌గా అంజలి.. వైరల్‌ అవుతున్న ట్రైలర్‌

Published : Dec 06, 2020, 10:09 AM ISTUpdated : Dec 06, 2020, 10:25 AM IST
గర్బవతిగా సాయిపల్లవి.. లెస్బియన్‌గా అంజలి.. వైరల్‌ అవుతున్న ట్రైలర్‌

సారాంశం

తాజాగా ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో సాయిపల్లవి గర్బవతిగా కనిపిస్తుంది. అంజలి, కల్కి కొచ్లిన్‌ లెస్బియన్‌గా కనిపిస్తున్నారు. గౌతమ్‌ మీనన్‌ ఓ విలక్షణ పాత్రలో కనిపిస్తున్నారు. ఆయనకు ఓ పాప ఉంది. ప్రకాష్‌ రాజ్‌.. సాయిపల్లవి తండ్రిగా విభిన్న పాత్రలో కనిపిస్తున్నారు. 

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఓ ట్రైలర్‌ హల్‌చల్‌ చేస్తుంది. అందరిని షాక్‌కి గురిచేస్తుంది. సినీ పెద్దలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ ట్రైలర్‌ పేరు `పావ కథైగల్‌`. తమిళంలో రూపొందుతున్న వెబ్‌ సిరీస్‌ ఇది. ప్రకాష్‌ రాజ్‌, గౌతమ్‌ మీనన్‌, సాయిపల్లవి, అంజలి, కల్కీ కొచ్లిన్‌ వంటి విలక్షణ తారాగణం నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ ఇది. మరి అంతగా ఆకట్టుకునే, అంతగా ఎంగేజ్‌ చేసే అంశాలు ఏమున్నాయనేది చూస్తే.. 

తాజాగా ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో సాయిపల్లవి గర్బవతిగా కనిపిస్తుంది. అంజలి, కల్కి కొచ్లిన్‌ లెస్బియన్‌గా కనిపిస్తున్నారు. గౌతమ్‌ మీనన్‌ ఓ విలక్షణ పాత్రలో కనిపిస్తున్నారు. ఆయనకు ఓ పాప ఉంది. ప్రకాష్‌ రాజ్‌.. సాయిపల్లవి తండ్రిగా విభిన్న పాత్రలో కనిపిస్తున్నారు. నాలుగు కథలను చెప్పే వెబ్‌ సిరీస్‌ ఇది. ఆద్యంతం ఎంగేజ్‌ చేయడంతోపాటు మనుషు మధ్య సంఘర్షణని తెలిపే ఈ వెబ్‌సిరీస్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

ఈ వెబ్‌ సిరీస్‌ మొత్తం నాలుగు కథల సమాహారంగా సాగుతుండగా, సుధ కొంగర, వెట్రిమారన్, గౌతమ్ మీనన్, విఘ్నేశ్ శివన్ వంటి టాప్‌ దర్శకులు రూపొందిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ లో ఇది విడుదల కానుంది. ట్రైలర్‌తోనే సౌత్‌ భాషలన్నింటిని షేక్‌ చేస్తుంది. విడుదల తర్వాత ఇది ఎలాంటి సంచలనాలు క్రియేట్‌ చేస్తుందో చూడాలి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Christmas Movies: క్రిస్మస్‌ కానుకగా విడుదలయ్యే సినిమాలివే.. కుర్రాళ్లతో శివాజీ ఫైట్‌.. ఒకే రోజు ఏడు సినిమాలు
అమ్మాయిల దుస్తులపై శివాజీ వల్గర్ కామెంట్స్...చిన్మయి, అనసూయ స్ట్రాంగ్ కౌంటర్