Akhanda Thanks Giving : ‘అఖండ’ 100 డేస్ సందర్భంగా ‘కృతజ్ఞత సభ’.. ఈవెంట్ ఎక్కడంటే..

Published : Mar 12, 2022, 01:43 PM IST
Akhanda Thanks Giving : ‘అఖండ’ 100 డేస్ సందర్భంగా ‘కృతజ్ఞత సభ’.. ఈవెంట్ ఎక్కడంటే..

సారాంశం

నందమూరి నటసింహం, టాలీవుడ్ హీరో బాలకృష్ణ (Balakrishna) ‘అఖండ’ మూవీతో  థియేట్రికల్ రన్ లో  రికార్డు బ్రేక్ చేశాడు. డిసెంబర్ 2న విడుదలై వంద రోజులు ఆడి తెలుగు సినిమా సత్తాను చాటిందీ చిత్రం. ఇందుకు ఈ రోజు అఖండ టీం ‘కృతజ్ఞత సభ’ను నిర్వహించనుంది.

అఖండ (Akhanda)మూవీతో బాలయ్యకు మరపురాని విజయం అందించారు బోయపాటి. వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ భారీ విజయం సాధించింది. బాలయ్య కెరీర్ లో వంద కోట్ల వసూళ్ళను సాధించిన మొదటి చిత్రంగా అఖండ నిలిచింది. ఇండియా మొత్తంగా  రూ.150 కోట్లు గ్రాస్ కలెక్షన్లను సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. హైహెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ సాధించిన రెండో చిత్రం అఖండ మూవీ నిలిచింది. మొదటి ప్లేస్ ను ‘పుష్ఫ’ దక్కించుకుంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ 365 కోట్లు సాధించింది. అయితే సంక్రాతికి ముందే రిలీజ్ అయిన బాలయ్య చిత్రం అఖండ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంకా తెలుగు రాష్ట్రాలలో అఖండ రన్ అక్కడక్కడా కొనసాగుతుంది. 

దీంతోవంద రోజులు పూర్తి చేసుకున్న అఖండ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఏపీలోని కర్నూల్ లో గల ఎస్టీబీసీ గ్రౌండ్స్ లో ‘కృతజ్ఞత సభ’ జరగనుంది. శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈవెంట్ ను లైవ్ లో వీక్షించేందుకు య్యూటూబ్ లింక్ ను జతచేస్తూ అఖండ నిర్మాణ సంస్థ ‘ద్వారక క్రియేషన్స్’ వారు అనౌన్స్ చేశారు.  అఖండ 100 డేస్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీలో బాలయ్య సరసన హీరోయిన్ ప్రాగ్యా జైస్వాల్ నటించింది. థమన్ మాస్ మ్యూజిక్ అందించి ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు. 

 

అఖండ థియేట్రికల్ రన్ లో భారీ విజయాన్ని సాధించడంతో టీం చాలా సంతోషం వ్యక్తం చేస్తోంది.  ఈవెంట్ సందర్భంగా బాలయ్య అభిమానులు కర్నూల్ కు చేరుకునే పనిలో ఉన్నారు. అఖండ విజయం అందించిన ఊపులో బాలకృష్ణ తన 107వ చిత్రం మొదలుపెట్టారు. క్రాక్ మూవీతో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకుడు. బాలయ్య లుక్ ఇప్పటికే బయటికి రాగా ఫ్యాన్స్ కి ఆకట్టుకుంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. 

PREV
click me!

Recommended Stories

చికిరీలు గికిరీలు, ఇదేం కథ.. పెద్ది సినిమాపై చీప్ కామెంట్స్.. విశ్వక్ సేన్ ఎలా రియాక్ట్ అయ్యాడో చూడండి
Sobhan Babu `సోగ్గాడు` మూవీతో పోటీ పడి దెబ్బతిన్న ఎన్టీఆర్‌.. శివాజీ గణేషన్‌కైతే చుక్కలే