Beast Telugu Trailer : ‘బీస్ట్’ తెలుగు, హిందీ వెర్షన్ ట్రైలర్ రిలీజ్.. ఆల్ ది బెస్ట్ చెప్పిన వరుణ్ దావన్..

Published : Apr 05, 2022, 06:48 PM ISTUpdated : Apr 05, 2022, 06:51 PM IST
Beast Telugu Trailer : ‘బీస్ట్’ తెలుగు, హిందీ వెర్షన్ ట్రైలర్ రిలీజ్.. ఆల్ ది బెస్ట్ చెప్పిన వరుణ్ దావన్..

సారాంశం

తమిళ స్టార్ హీరో థళపతి విజయ్ (Vijay Thalapathy) నటించిన తాజా చిత్రం ‘బీస్ట్’ ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ‘అరబిక్ కుత్తు’ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. తాజాగా తెలుగు వెర్షన్ ట్రైలర్ లాంచ్ అయ్యింది.  

కోలీవుడ్ స్టార్ థళపలి విజయ్, గ్లామర్ బ్యూటీ పూజా హెగ్దే (Pooja Hegde) జంటగా నటిస్తున్న చిత్రం ‘బీస్ట్’ Beast. డైరెక్టర్ నెల్సన్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ లో నిర్మించారు. తమిళ వెర్షన్‌తో పాటు, ఈ చిత్రం తెలుగులో కూడా ఏప్రిల్ 13న ఏకకాలంలో విడుదల కానుంది. మూవీలో విజయ్ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో నటించాడు. భయంకరమైన ఉగ్రవాదులతో పోరాడడం సినిమా మరింత ఆసక్తిని పెంచుతోంది. 

ఈ పాన్ ఇండియా చిత్రం నుంచి తాజాగా ఇప్పటికే తమిళ వెర్షన్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. కాగా తాజాగా తెలుగు, హిందీ వెర్షన్ లో మేకర్స్ ట్రైలర్స్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ లో కథానాయకుడు విజయ్ ధైర్యసాహసాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. భయంకరమైన ఉగ్రవాదులతో పోరాడటం సినిమాపై హైప్ పెంచుతోంది. ట్రైలర్ పూర్తిగా ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయింది. హైదరాబాద్‌లోని ఈస్ట్ కోస్ట్ మాల్ అనే షాపింగ్ మాల్‌ను ఉగ్రవాదులు హైజాక్ చేశారు. దీంతో సెల్వరాఘవన్ సంధానకర్తగా ప్రభుత్వంతో  చర్చలు జరిపుతాడు. అప్పటికే  గూఢచారులలో అత్యుత్తమ భారతీయ సైనికుడు అయిన వీరరాఘవ (విజయ్) మాల్ లోపలికి చేరుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతందనే అసలు సినిమా? ఆ తర్వాత ఆ టెరర్రిస్టుల అంతు తేల్చేందుకు స్పై టీం ఏం చేయబోతుందనేది మిగితా సినిమాగా తెలుస్తోంది. 

 

ట్రైలర్ లో ముఖ్యంగా ‘బికాజ్ ఐయామ్ నాట్ ఏ పొలిటిషన్.. ఐయామ్ ఏ సోల్జర్’అనే పవర్ ఫుల్ డైలాగ్స్ ఆక్టట్టుకుంటున్నాయి. ఇక బీజీఎం గురించి మాట్లాడుకుంటే.. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ (Anirudh) అదిరిపోయే మ్యూజిక్ అందించారు. యాక్షన్ సీక్వెన్స్ కు తగ్గట్టుగా మాస్ బీట్ ను మోగించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ‘హలమతి హబిబో’, జాలీ హో జింఖానా’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. అరబిక్ కుతు మాత్రం ఇప్పటికే 200 మిలియన్ల వ్యూస్ తో యూటూబ్ ను షేక్ చేస్తోంది. 

 

హిందీ వెర్షన్ ట్రైలర్ ను బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ దావన్ (Varun Dhawan) లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ చేయడం పట్ల వరుణ్ సంతోషం వ్యక్తం చేశారు. యాక్షన్ పాక్డ్ గా వచ్చిన ‘బీస్ట్ హిందీ ట్రైలర్’ ఒకరకమైన శక్తిని, భయాన్ని కలిగించాయని తెలిపాడు. తాను ఎప్పుడూ విజయ్ కి పెద్ద అభిమానినే అని వ్యక్తం చేశాడు. అలాగే టీం అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పాడు. ఈ చిత్రానికి అనిరుధ్ రవించందర్ నేపథ్య సంగీతం అందించగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీగా పనిచేశారు. బీస్ట్‌లో పూజా హెగ్డే, సెల్వరాఘవన్, యోగి బాబు, రెడిన్ కింగ్స్లీ, బ్జోర్న్ సుర్రావ్, VTV గణేష్, అపర్ణా దాస్ పలు కీలక పాత్రల్లో నటించారు.  

PREV
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే
Prabhas: దేశముదురు దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన ప్రభాస్ సినిమా..ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్