RRR Movie Collections: ఆర్ ఆర్ ఆర్ గ్రాండ్ రికార్డు...వంద కోట్లతో నైజాం బాక్సాఫీస్ బద్దలు!

Published : Apr 05, 2022, 06:23 PM IST
RRR Movie Collections: ఆర్ ఆర్ ఆర్ గ్రాండ్ రికార్డు...వంద కోట్లతో నైజాం బాక్సాఫీస్ బద్దలు!

సారాంశం

విడుదలై రెండు వారాలు దగ్గరపడుతున్నా ఆర్ ఆర్ ఆర్ మూవీ వసూళ్లు నిలకడగా సాగుతున్నాయి. ఇప్పటికే అనేక రికార్డ్స్ బద్దలుకొట్టిన ఆర్ ఆర్ ఆర్ మూవీ నైజాంలో తిరుగులేని చరిత్ర నమోదు చేసింది.   

స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ చిత్రాలకు నైజాంలో రూ. 50 కోట్ల షేర్ అంటే గగనం. అలాంటిది ఆర్ ఆర్ ఆర్(RRR Movie Collections) ఏకంగా రూ. 100 కోట్ల షేర్ రాబట్టి ఘనమైన రికార్డు నమోదు చేసింది. విడుదలైన 12రోజులకు నైజాంలో ఆర్ ఆర్ ఆర్ వంద కోట్ల షేర్ మార్క్ చేరుకుంది. గతంలో నైజాంలో అత్యధిక షేర్ రికార్డు బాహుబలి 2 పేరిట ఉంది. ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్ లో 2017లో విడుదలైన బాహుబలి 2 అత్యధికంగా రూ. 68 కోట్ల షేర్ వరకు రాబట్టినట్లు సమాచారం. 

ఇక ఆర్ ఆర్ ఆర్ నైజాం హక్కులు స్టార్ ప్రొడ్యూసర్ రూ. 70 కోట్లకు దక్కించుకున్నారు. దీనితో ఆయన భారీ లాభాలు ఆర్ ఆర్ ఆర్ ద్వారా ఆర్జించారు. ఈ నేపథ్యంలో ఆయన పరిశ్రమ ప్రముఖలతో పాటు ఆర్ ఆర్ ఆర్ యూనిట్ కి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళితో పాటు పలువురు స్టార్ దర్శకులు హాజరయ్యారు. 

బాహుబలి 2 రికార్డును రాజమౌళి (Rajamouli) ఆర్ ఆర్ ఆర్ మూవీతో బ్రేక్ చేశారు. ఇక తన రికార్డ్స్ తానే బ్రేక్ చేసుకుంటున్న రాజమౌళి మహేష్ మూవీతో ఆర్ ఆర్ ఆర్ నైజాం వంద కోట్ల షేర్ రికార్డు బద్దలుకొడతాడేమో చూడాలి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ వసూళ్లు రూ. 900 కోట్లు దాటేశాయి. వెయ్యి కోట్ల మ్యాజిక్ ఫిగర్ ని ఆర్ ఆర్ ఆర్ చేరుకోవడం పెద్ద కష్టంగా కనిపించడం లేదు. బీస్ట్, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలు విడుదలయ్యే వరకు బాక్సాఫీస్ వద్ద ఆర్ ఆర్ ఆర్ జోరు కొనసాగనుంది.

ఇక ఆర్ ఆర్ ఆర్ కోసం పెంచిన టికెట్స్ ధరలు కూడా తగ్గించారు. బడ్జెట్ కారణంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ చూడని కుటుంబాలు ధరలు తగ్గడంతో థియేటర్స్ కి పోటెత్తే అవకాశం కలదు. మొత్తంగా పాండమిక్ తర్వాత రాజమౌళి ఇండియన్ బాక్సాఫీస్ ఆర్ ఆర్ ఆర్ మూవీ దుమ్ముదులిపారు. 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?