Rashmika Birthday: థళపతి విజయ్‌తో నేషనల్‌ క్రష్‌ కన్ఫమ్‌.. కొత్త ప్రాజెక్ట్ లతో తగ్గేదెలే అంటోందిగా!

Published : Apr 05, 2022, 04:31 PM ISTUpdated : Apr 05, 2022, 04:33 PM IST
Rashmika Birthday: థళపతి విజయ్‌తో నేషనల్‌ క్రష్‌ కన్ఫమ్‌.. కొత్త ప్రాజెక్ట్ లతో తగ్గేదెలే అంటోందిగా!

సారాంశం

ఇళయ థళపతి విజయ్‌తో రష్మిక మందన్నా జోడి కట్టబోతుందని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలను కన్ఫమ్‌ చేసింది యూనిట్‌. ఆమె బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు.

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా(Rashmika Mandanna) ఇటు సౌత్‌లో, అటు నార్త్ లో దూసుకుపోతుంది. ఆమె వరుసగా భారీ సినిమాలను దక్కించుకుంటూ తన సత్తాని చాటుకుంటుంది. `పుష్ప`(Pushpa) చిత్రంతో నేషనల్‌ వైడ్‌గా ఫాలోయింగ్‌ని పెంచుకున్న రష్మిక మందన్నా నేడు(ఏప్రిల్‌ 5)న పుట్టిన రోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమెకి సంబంధించి బ్యాక్‌ టూ బ్యాక్‌ కొత్త ప్రాజెక్ట్ ల అనౌన్స్ మెంట్స్  వస్తుండటం విశేషం. 

చాలా కాలంగా కోలీవుడ్‌ స్టార్‌ థళపతి విజయ్‌(Vijay)తో జోడీ కట్టబోతుందనే టాక్‌ వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీన్ని కన్ఫమ్‌ చేసింది యూనిట్‌. విజయ్‌తో తెలుగు డైరెక్టర్‌ వంశీపైడిపల్లి రూపొందిస్తున్న  తెలుగు, తమిళం బైలింగ్వల్‌ మూవీ `vijay 66` లో రష్మిక మందన్నాని హీరోయిన్‌గా ఖరారు చేశారు. ఆమెని ప్రాజెక్ట్ లోకి ఆహ్వానిస్తూ బర్త్ డే విషెస్‌ తెలిపారు. ఈ సినిమాతో విజయ్‌ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 

మరో తెలుగు కొత్త సినిమా అనౌన్స్ మెంట్‌ కూడా వచ్చింది. `మహానటి` ఫేమ్‌ దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో ఓ సినిమా చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మికనే హీరోయిన్‌గా ఖరారు చేశారు. వార్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో దుల్కర్‌కి జోడీగా అఫ్రీన్‌ పాత్రలో రష్మిక మందన్నా నటించబోతుంది. తాజాగా ఈ చిత్రంలోని ఆమె ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది యూనిట్‌. రష్మిక లుక్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 

మరోవైపు కొత్తగా హిందీలో రణ్‌బీర్‌ కపూర్‌తో `యానిమల్‌` సినిమా చేస్తుంది. ఇటీవలే చిత్ర దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. హీరోయిన్‌గా రష్మికని ఆహ్వానించారు. మరోవైపు హిందీలో `మిషన్‌ మజ్ను`, `గుడ్‌బై` సినిమాలు చేస్తుంది రష్మిక. అలాగే తెలుగులో `పుష్ప`కి రెండో పార్ట్ గా రాబోతున్న `పుష్ప 2`లోనూ ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇలా తెలుగు, తమిళం, హిందీలో బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తూ దూసుకుపోతుందీ నేషనల్‌ క్రష్‌.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?
Soori Apologizes: అభిమానికి క్షమాపణ చెప్పిన కమెడియన్.. షూటింగ్ స్పాట్‌లో ఏం జరిగింది?