వార్నింగ్ లతో హల్ చల్ చేస్తున్న బండ్ల గణేష్

Published : Jan 28, 2017, 01:48 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
వార్నింగ్ లతో హల్ చల్ చేస్తున్న బండ్ల గణేష్

సారాంశం

మళ్లీ బయటికొచ్చిన బండ్ల గణేష్ పవనిజం జిందాబాద్ అంటున్న బండ్ల గణేష్ సారీలు, వార్నింగ్ లతో హల్ చల్ చేస్తున్న గణేష్

పవన్ కళ్యాణ్ వీరాభిమాని, నిర్మాత బండ్ల గణేష్‌ తిరిగొచ్చాడు. అవును గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న గణేష్ తాజాగా పవన్ కళ్యాణ్ తో తిరిగి పోటో దిగి పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన ఆ పోటో గణేష్ ఉనికిని చాటింది. అయితే... ఇటీవల మీడియాతో తెగ ఇంటరాక్ట్ అవుతున్న గణేష్ తన దేవుడిని పొగడటమే కాకుండా పనిలోపనిగా కొందరికి వార్నింగ్ లు, మరి కొందరు హీరోలకు సారీలు ఇలా హంగామా చేస్తున్నాడు.

 

బండ్ల గణేష్ ఇప్పుడు తెగ సందడి చేస్తున్నాడు.  ఓ దర్శకుడి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తన దేవుడైన పవన్‌కళ్యాణ్‌ మీద పొగడ్తల వర్షం కురిపించేశాడు. ఇంకో హీరోకి సారీ చెప్పాడు, మరో హీరోతో విభేదాలపై క్లారిటీ ఇచ్చాడు. అన్నట్టు, ఓ హీరోకి తన బలం గురించి చెబుతూ, వార్నింగ్‌ కూడా ఇచ్చేశాడండోయ్‌.

 

ఇక, తన దేవుడు పవన్‌కళ్యాణ్‌, ముఖ్యమంత్రి అవడం ఖాయమంటూ బండ్ల గణేష్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. అసలు తాను రాజకీయాల్లోకి వచ్చింది పదవుల కోసం కాదనీ, ప్రస్తుత రాజకీయాలు తనకు సరిపడవనీ, రాజకీయాల్లో యువతను ప్రోత్సహించాలన్నదే తన ఉద్దేశ్యమనీ నిన్నటికి నిన్న పవన్‌కళ్యాణ్‌ తాజాగా క్లారిటీ ఇచ్చిన విషయం విదితమే. ఏమోగానీ, బండ్ల గణేష్‌కి మాత్రం తన దేవుడు పవన్‌కళ్యాణ్‌ ముఖ్యమంత్రి అవుతాడనే గట్టి నమ్మకం వుంది. ఎవరి నమ్మకం వాళ్ళది.! భక్తుడు కదా, తన దేవుణ్ని ఆ మాత్రం నమ్మాలి మరి.

PREV
click me!

Recommended Stories

Supritha: ఎంట్రీతోనే భయపెట్టబోతున్న సురేఖ వాణి కూతురు.. ఎస్తర్‌, సుప్రీత, ధన్య కలిసి హర్రర్‌ మూవీ
Jr Ntr కి రెండో సారి హ్యాండిచ్చిన త్రివిక్రమ్‌.. తారక్‌కే ఎందుకిలా జరుగుతుంది?