మెగా మనసు దోచుకున్న బండ్ల గణేష్.. చిరు విషయంలో ప్రభుత్వానికి ఊహించని డిమాండ్

pratap reddy   | Asianet News
Published : Aug 23, 2021, 09:48 AM IST
మెగా మనసు దోచుకున్న బండ్ల గణేష్.. చిరు విషయంలో ప్రభుత్వానికి ఊహించని డిమాండ్

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ రాజకీయ ప్రముఖుల నుంచి చిరంజీవికి జన్మదిన వేడుకలు వెల్లువలా వచ్చాయి. 

మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ రాజకీయ ప్రముఖుల నుంచి చిరంజీవికి జన్మదిన వేడుకలు వెల్లువలా వచ్చాయి. ఇక చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలసి బర్త్ డే సెలెబ్రేట్ చేసుకున్నారు. 

చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆదివారం సాయంత్రం ప్రముఖ దర్శకులు, నిర్మాతలతో ట్విట్టర్ లో స్పేస్ నిర్వహించడం జరిగింది. ప్రముఖ యాంకర్ సుమ ఈ స్పేస్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. డైరెక్టర్ బాబీ, కోన వెంకట్, నవీన్ పోలిశెట్టి, బండ్ల గణేష్ లాంటి ప్రముఖులంతా పాల్గొన్నారు. 

ఈ స్పేస్ లో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. చిరంజీవి సాధించిన ఘనతలపై ప్రశంసలు కురిపించాడు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే తెలుగువారికి ఒక పండుగ అని అన్నారు. సాధారణ కానిస్టేబుల్ కుటుంబం నుంచి ఈ స్థాయికి ఎదగడం అంటే మాటలు కాదు అని బండ్ల గణేష్ అన్నారు. 

చిరంజీవి చరిత్రని పాఠ్యపుస్తకాలలో పెడితే భావితరాలకు మంచి జరుగుతుంది అని బండ్ల గణేష్ ఆసక్తికర ప్రతిపాదన చేశారు. చిరంజీవి చరిత్రని పిల్లలు చదువుకుంటే చాలా బావుంటుంది. పిల్లలకు ఆయన చరిత్ర ఆదర్శంగా నిలుస్తుంది అని బండ్ల గణేష్ కామెంట్స్ చేసి మరోసారి మెగా అభిమానుల మనసు దోచుకున్నారు. 

ఇక తాను ఒత్త సెరప్పు సైజు 2 చిత్ర రీమేక్ లో నటిస్తున్న విషయాన్ని బండ్ల గణేష్ ధృవీకరించారు. 

PREV
click me!

Recommended Stories

సర్జరీతో పాడైపోయిన పెదవులు, హీరోయిన్ పై దారుణంగా ట్రోలింగ్.. 9 నెలలు డిప్రెషన్ లో..
అడ్వాన్స్ బుకింగ్స్ తో రికార్డ్స్ సృష్టించిన టాప్ 5 ఇండియన్ సినిమాలు ఇవే.. అందులో తెలుగు సినిమాలే 4