ఇంట్రెస్టింగ్ న్యూస్...  చిరు భోళా శంకర్ లో బిగ్ బాస్ బ్యూటీ!

By team teluguFirst Published Aug 23, 2021, 7:57 AM IST
Highlights

ఆచార్య అనంతరం మూడు చిత్రాలు చిరంజీవి ప్రకటించగా అందులో భోళా శంకర్ ఒకటి. దర్శకుడు మెహర్ రమేష్ భోళా శంకర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకలు గ్రాండ్ గా ముగిశాయి. ఆగష్టు 22న చిరంజీవి తన 66వ బర్త్ డే జరుపుకోగా సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ వెల్లువెత్తాయి.  ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్, పవన్ వంటి స్టార్స్ తో పాటు చిత్ర ప్రముఖులు చిరంజీవికి బర్త్ డే విషెష్ తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిరు అభిమానులు ఆయన పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు. మరో వైపు చిరంజీవి తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఫ్యాన్స్ కి బర్త్ డే గిఫ్ట్స్ గా అందించారు. 


ఆచార్య అనంతరం మూడు చిత్రాలు చిరంజీవి ప్రకటించగా అందులో భోళా శంకర్ ఒకటి. దర్శకుడు మెహర్ రమేష్ భోళా శంకర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అజిత్ హీరోగా 2015లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న తమిళ్ చిత్రం వేదాళం కి భోళా శంకర్ అధికారిక రీమేక్. కాగా ఈ మూవీలో చిరు చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. రాఖి పూర్ణిమ నేపథ్యంలో నిన్న చిరు, కీర్తి సురేష్ ల స్పెషల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. 


కాగా భోళా శంకర్ మూవీలో బిగ్ బాస్ బ్యూటీ దివి సైతం ఓ రోల్ చేస్తున్నారట. లేటెస్ట్ ఇంటర్వ్యూలో దివి ఈ విషయాన్ని తెలియజేశారు. భోళా శంకర్ మూవీలో తాను నటిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. మరి ఈ చిత్రంలో దివి రోల్ ఏమిటనేది స్పష్టత రావాల్సి ఉంది. బిగ్ బాస్ షో ద్వారా ఫేమ్ తెచ్చుకున్న దివి ఇప్పుడిప్పుడే కెరీర్ లో ఎదుగుతున్నారు. భోళా శంకర్ లో ఆమెకు అవకాశం దక్కడం, కెరీర్ కి ఉపయోగపడే అంశం అని చెప్పాలి. 2022లో భోళా శంకర్ విడుదల కానుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ భోళా శంకర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

click me!