Bheemla Nayak: న్యాయానికి ధర్మానికి రోజులు లేవు.. 'భీమ్లా నాయక్'పై బండ్ల గణేష్ హాట్ కామెంట్స్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 22, 2021, 04:16 PM ISTUpdated : Dec 22, 2021, 04:20 PM IST
Bheemla Nayak: న్యాయానికి ధర్మానికి రోజులు లేవు.. 'భీమ్లా నాయక్'పై బండ్ల గణేష్ హాట్ కామెంట్స్

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన Bheemla Nayak చిత్రం సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దిల్ రాజుతో సహా ఇతర నిర్మాతలు భీమ్లా నాయక్ నిర్మాతలపై ఒత్తిడి చేసి పక్కకు తప్పించారనే ప్రచారం జరుగుతోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దిల్ రాజుతో సహా ఇతర నిర్మాతలు భీమ్లా నాయక్ నిర్మాతలపై ఒత్తిడి చేసి పక్కకు తప్పించారనే ప్రచారం జరుగుతోంది. ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లాంటి భారీ చిత్రాలు సంక్రాంతి బరిలో ఉన్నప్పటికీ భీమ్లా నాయక్ చిత్రాన్ని కూడా సంక్రాంతికే తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. 

కానీ వసూళ్లపై ప్రభావం ఉంటుందనే కారణంతో ఇటు రాధే శ్యామ్ నిర్మాతలు, అటు ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య.. దిల్ రాజు, టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తో కలసి భీమ్లా నాయక్ మేకర్స్ ని రిక్వస్ట్ చేసారు. దీనితో భీమ్లా నాయక్ చిత్రాన్ని వాయిదా వేయక తప్పని పరిస్థితి నెలకొంది. 

తన చేతుల్లో ఏమీ లేకుండా పోయింది అంటూ పవన్ అభిమానులకు భీమ్లా నాయక్ నిర్మాత నాగవంశీ క్షమాపణలు చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక రాజమౌళి కూడా మహేష్ బాబుని ప్రశంసలతో ముంచెత్తుతూ చేసిన ట్వీట్ వివాదాన్ని ఇంకాస్త పెంచింది. దీనితో భీమ్లా నాయక్ పోస్ట్ పోన్ పై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. 

దీనితో పవన్ ఫ్యాన్స్ ఇండస్ట్రీ పెద్దలని ప్రశ్నిస్తూ ట్రోల్ ట్రోల్ చేస్తున్నారు. భీమ్లా నాయక్ చిత్రాన్ని వీళ్లంతా కలసి వాయిదా వేయించారు. 'రేపు పవన్ చిత్రానికి సమస్య వస్తే ఈ నిర్మాతలంతా సాయం చేస్తారా ? అని ఓ నెటిజన్ బండ్ల గణేష్ ని అడిగాడు. దీనికి బండ్ల గణేష్.. న్యాయానికి ధర్మానికి రోజులు లేవు బ్రదర్ అంటూ రిప్లై ఇవ్వడం ఆసక్తిగా మారింది. 

 

భీమ్లా నాయక్ చిత్రంలో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. పవన్, రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఇది. సాగర్ చంద్ర దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Also Read: Raashi Khanna :రాశి ఖన్నా అందాలు దాచలేకపోతున్న బ్లాక్ శారీ.. నడుము, క్లీవేజ్ గ్లామర్ తో హాట్ ట్రీట్

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్