బసవతారకం హాస్పిటల్ ముందు బండ్ల గణేష్ అన్నదానం, ట్వీట్ చేసిన సంచలన నటుడు

Published : Sep 19, 2023, 02:20 PM IST
బసవతారకం హాస్పిటల్ ముందు బండ్ల గణేష్ అన్నదానం, ట్వీట్ చేసిన సంచలన నటుడు

సారాంశం

బసవతారకం హాస్పిటల్ ముందు అన్నదానంచేశారు ప్రముఖ నిర్మాత, నటుడు బండ్లగణేష్. ఇలా అన్న ప్రసాదం పంచడం తనకు ఎంతో సంతోషంగా ఉంది అన్నారు బండ్ల. ఇంతకీ విశేషం ఏంటంటే..?    

బండ్ల గణేష్ ఎప్పుడూఏదో ఒక రకంగా న్యూస్ ఐటమ్ అవుతూనే ఉంటాడు. టీవీలకు బ్రేకింగ్ న్యూస్ లుఅందించడంలో బండ్ల ముందుంటారు.  ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటారు. నటుడిగా, నిర్మాతగా కంటే .. తన కంట్రవర్సీయల్ కామెంట్స్ తో ఎక్కువగా వైరల్ అవుతుంటాడు బండ్ల. తన స్పీచ్ లతో, ఇంటర్వ్యూలతో ఫుల్ ఫాలోయింగ్ తెచ్చుకున్న బండ్ల గణేష్ ట్విట్టర్లో కూడా  అదే సంచలనాల జోరు చూపిస్తుంటాడు. అటు సినిమాలు.. ఇటు పాలిటక్స్ .. ఏ విషయంలో కూడా తన మార్క్ తగ్గకుండా చూపిస్తూ.. తాను టార్గెట్ చేసిన వారిని గట్టిగా ఇచ్చుకుంటూ ఉంటాడు. 

ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు.. షాకింగ్ విజపయాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నాడు బండ్ల.. ఓ పక్క పొలిటికల్ పోస్టులు షేర్ చేస్తూనే సినిమా పోస్టులు కూడా షేర్ చేస్తారు. ఆసక్తికర పోస్టులు పెడుతూ ఉంటారు. ప్రస్తుతానికి బండ్ల సినిమాలకు దూరంగా ఉన్నారు.తాజాగా బండ్ల గణేష్ మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. అయితే ఈసారి కాంట్రవర్సీ యాంగిల్ కాదు.. కరుణామయుడిగా మారిపోయాడు. .. పేదలకు అన్నదానం నిర్వహించారు. హైదరాబాద్ లోనిబాలకృష్ణ(Balakrishna)కు చెందిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్(Basavatarakam Cancer Hospital) ముందు బండ్ల గణేష్ తన భార్య, మరికొంతమందితో కలిసి అన్నదానం నిర్వహించారు. 

 

బసవతారకం హాస్పిటల్ తో బాలకృష్ణ ఎంతోమంది పేదలకు ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దీంతో ఎంతోమంది పేదలు, వారి ఫ్యామిలీలు హాస్పిటల్ కి వస్తుంటారు. బసవతారకం హాస్పిటల్ బయట ఎంతో మంది పేదలు.. తమ రోగులకు సబంధించిన బంధువులు ఎదరుచూస్తూ ఉంటారు. అటువంటివారికి  ఎప్పుడూ ఎవరో ఒకరు అన్న ప్రసాదం అందిస్తూనే ఉంటారు. అన్నదానమే కాదు.. కావల్సిన వస్తువులు, అవసరాలు తీర్చే వి ఎవరో ఒకరు స్వచ్ఛంద సంస్థలు కూడా నిర్వహిస్తుంటారు. 
ఈ క్రమంలోనే నిన్న వినాయకచవితి సందర్భంగా బండ్లగణేష్ అక్కడ ఉన్నవాళ్ళకి అన్నదానం చేశారు. ఆయనే స్వయంగా వడ్డించారు. ఈ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఇలా అన్నదానం చేయడం ఎంతో ఆనందంగా ఉంది. నేను నా భార్యతోకలిసి ఈ అన్న ప్రసాదం  కార్యక్రమంలో పాల్గోనడం ఎంతో  సంతోషాన్ని ఇచ్చింది అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తో పాటు.. అన్నదానం వీడియో వైరల్ అవుతోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?