ఆదిల్ దుర్రానితో పెళ్లి వీడియో, ప్రైవేట్ చాట్స్ బయటపెట్టిన రాఖీ సావంత్!

Published : Sep 19, 2023, 11:38 AM IST
ఆదిల్ దుర్రానితో పెళ్లి వీడియో, ప్రైవేట్ చాట్స్ బయటపెట్టిన రాఖీ సావంత్!

సారాంశం

కొన్నాళ్లుగా ఆదిల్ దుర్రాని- హీరోయిన్ రాఖీ సావంత్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుండగా... ఆమె తమ పెళ్లి వీడియోలు, సర్టిఫికెట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.   

ఆదిల్ దుర్రాని తనను మోసం చేశాడనేది రాఖీ సావంత్ ప్రధాన ఆరోపణ. తనను వివాహం చేసుకొని మరొక స్త్రీతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని గతంలో ఆరోపణలు చేసింది. తాజాగా ఆదిల్ దుర్రానితో తన పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఆదిల్ దుర్రాని ముస్లిం కాదని బయట చెప్పుకుంటున్నాడు. నన్ను వివాహం చేసుకోలేదని అబద్దం ఆడుతున్నాడు. అతడు ముస్లిం కాకపోతే నన్ను ముస్లిం సాంప్రదాయ పద్దతిలో ఎలా వివాహం చేసుకున్నాడని ఆమె ఆధారాలు బయటపెట్టింది. 

ఓ ముస్లిం పెద్ద స్వయంగా వీరి వివాహం చేశారు. సంతకాలు, వేలి ముద్రలు తీసుకుని పెళ్లి కార్యక్రమం ముగించాడు. అలాగే ఉర్దూలో రాసి ఉన్న మ్యారేజ్ సర్టిఫికెట్ ని రాఖీ సావంత్ బయట పెట్టింది. సదరు మ్యారేజ్ సర్టిఫికెట్ లో రాఖీ సావంత్ పేరు ఫాతిమాగా ఉంది. ఆదిల్ దుర్రాని నన్ను వివాహం చేసుకున్నాడని చెప్పేందుకు ఇంతకంటే ఆధాలేం కావాలని రాఖీ సావంత్ నిలదీశారు. 

ఆదిల్ దుర్రాని తనతో చేసిన ఇంస్టాగ్రామ్ ప్రైవేట్ చాట్ సైతం ఆమె బయటపెట్టింది. ఆ చాట్ లో బిగ్ బాస్ లేదా లాక్ అప్ షోలకు వెళ్లేందుకు హెల్ప్ చేయమని ఆదిల్ దుర్రాని రాఖీ సావంత్ ని రిక్వెస్ట్ చేస్తున్నాడు. సరే డియర్ అని రాఖీ సావంత్ రిప్లై ఇచ్చింది. ఫేమస్ కావడానికి నన్ను వాడుకున్న ఆదిల్ దుర్రాని అనంతరం నన్ను మోసం చేశాడని రాఖీ సావంత్ ఆరోపిస్తున్నది. 

గతంలో కూడా మీడియా ముందు ఆదిల్ దుర్రానిపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. నివేదిత చందేల్ అనే మహిళతో ఆదిల్ దుర్రాని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమె వద్ద ఇతడి ప్రైవేట్ వీడియోలు ఉన్నాయి. అదిల్ ని ఆమె బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఒకసారి నాకు దొరికిపోయాడు. ఇకపై ఆమెను కలవనని ఖురాన్ పై ఒట్టేశాడు. కానీ మాట తప్పి రహస్యంగా ఆమెతో ఎఫైర్ నడుపుతున్నాడని ఆమె ఆవేదన చెందారు. మరోవైపు  జైలు నుండి బయటకు వచ్చిన ఆదిల్ రాఖీ సావంత్ పై ఆరోపణలు చేశాడు. ఆమె తనను కొట్టేదని, తన డబ్బులు కూడా వాడుకుందని అంటున్నాడు. 

రాఖీ సావంత్ ఫేమస్ ఐటెం గర్ల్. తెలుగులో సిక్స్ టీన్స్ మూవీలో ఆమె నటించారు. నితిన్ హీరోగా తెరకెక్కిన ద్రోణ చిత్రంలో ఓ ఐటెం సాంగ్ చేసింది. హిందీ, తమిళ్, భోజ్ పురితో పాటు పలు భాషల్లో 30కి పైగా ఐటెం సాంగ్స్ చేసింది. బాలీవుడ్ లో ఆమె అనేక చిత్రాల్లో నటించారు. 
 

PREV
click me!

Recommended Stories

జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?
చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది