
సున్నితమైన ప్రేమకథలను.. వైవిధ్యభరితంగా తెరపై ఆవిష్కరించగలడు అని పేరు తెచ్చుకున్న దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. అయితే ఆయనకు కొంతకాలంగా హిట్ అనేది లేదు. మరో ప్రక్క ఏదో ఒక కొత్తదనం తన కథలో ఉండాలని చూసుకునే హీరోల్లో అఖిల్ అక్కినేని ఒకరు. అఖిల్ కు కెరీర్ ప్రారంభం నుంచి ఒక్క హిట్టూ లేదు.దాంతో ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి అంతటా కలిగింది. ఈ ఇద్దరి కలయిక నుంచి వచ్చిన ఓ న్యూఏజ్ లవ్‌స్టోరీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. పూజాహెగ్డే హీరోయిన్ . ‘ఒంగోలు గిత్త’ తర్వాత ఎనిమదేళ్ల విరామం తీసుకుని భాస్కర్ తెరకెక్కించిన చిత్రమిది. దసరా సందర్భంగా బాక్సాఫీస్ ముందుకొచ్చింది.
Also read Bangarraju First Single promo: లడ్డుందా అంటోన్న నాగార్జున.. సోగ్గాడి సందడి షురూ
అప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్స్ ఆకట్టుకోవడంతో సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ దక్కింది. దీంతో సినీప్రియులు ఈ చిత్రంపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఆ అంచనాలను అఖిల్, పూజాల జోడీ చాలా వరకూ అందుకుందనే చెప్పాలి. బొమ్మరిల్లు భాస్కర్ చెప్పిన ప్రేమకథ ప్రేక్షకుల్ని మెప్పించింది.ఈ సినిమాతో ఆయన హిట్ ట్రాక్ ఎక్కారు. అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుని దసరా విజేతగా నిలవడమే కాకుండా సాలీడ్ కలెక్షన్లను కూడా రాబట్టింది.
Also read 'రొమాంటిక్' కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ అవుతుందా?
క్లోజింగ్ కలెక్షన్ రిపోర్ట్స్
నైజాం – 7.59 కోట్లు
సీడెడ్ – 4.08 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.44 కోట్లు
ఈస్ట్ – 1.25 కోట్లు
వెస్ట్ – 1.04 కోట్లు
గుంటూరు – 1.43 కోట్లు
కృష్ణా – 1.19 కోట్లు
నెల్లూరు – 0.87 కోట్లు
ఏపీ + తెలంగాణ – 19.85 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ – 3.94 కోట్లు
వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ – 23.77 కోట్లు షేర్
ఈ సినిమాకు రూ.20.91 కోట్ల బిజినెస్ జరిగింది. మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.17.23 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. దీంతో బయ్యర్లకు 3 కోట్లకు పైగా లాభాలు వచ్చాయి.
హర్షగా అఖిల్.. స్టాండప్ కమెడియన్ విభాగా పూజా హెగ్డే.. తమ తమ పాత్రల్లో ఎంతో చక్కగా ఒదిగిపోవటం కలసివచ్చింది. ముఖ్యంగా పూజా తన గ్లామర్‌తో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. రొమాంటిక్ సన్నివేశాల్లో అఖిల్, పూజాల జోడీ ఎంతో చూడముచ్చటగా కనిపించింది. లెహరాయి, గుచ్చే గులాబిలాగా పాటలు ఎంతో వినసొంపుగా ఉన్నాయో.. వాటి పిక్చరైజేషన్ కూడా అంతే ఎట్రాక్టివ్ గా ఉంది.