సైదాబాద్‌ హత్యాచార ఘటనపై నాని వైల్డ్ రియాక్షన్..

pratap reddy   | Asianet News
Published : Sep 15, 2021, 03:54 PM IST
సైదాబాద్‌ హత్యాచార ఘటనపై నాని వైల్డ్ రియాక్షన్..

సారాంశం

సైదాబాద్ చిన్నారి హత్యాచార సంఘటన సగటు పౌరుల హృదయాలు కలచివేస్తోంది. సెలెబ్రిటీలు సైతం ఈ సంఘటనపై స్పందిస్తూ నిందితుడిని త్వరగా అరెస్ట్ చేసి ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు.

సైదాబాద్ చిన్నారి హత్యాచార సంఘటన సగటు పౌరుల హృదయాలు కలచివేస్తోంది. సెలెబ్రిటీలు సైతం ఈ సంఘటనపై స్పందిస్తూ నిందితుడిని త్వరగా అరెస్ట్ చేసి ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరేళ్ళ చిన్నారిపై అత్యంత అమానుషంగా ప్రవర్తించి హత్యాచారం చేసిన రాజు బ్రతికి ఉండకూడదు అని ప్రజలు కోరుకుంటున్నారు. 

సినీ హీరో మంచు మనోజ్ స్వయంగా స్పందించి ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్, బైక్ పై కాకుండా మీడియా ఇలాంటి సంఘటనలపై ఫోకస్ పెట్టాలని మనోజ్ సూచించాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే. 

ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక సమాజంగా మనం ఎంత దిగజారిపోతున్నామో అనేది గుర్తు చేసుకోవాలి అని మహేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం నిందితుడు రాజు పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్న సంగతి తెలిసిందే. నిందితుడి ఆచూకీ తెలియజేసిన వారికి పోలీసులు 10 లక్షల రివార్డ్ కూడా ప్రకటించారు. తాజాగా నేచురల్ స్టార్ నాని ఈ సంఘటనపై స్పందించాడు. 

సింపుల్ కామెంట్ తో నాని రియాక్షన్ వైల్డ్ గా ఉంది. పోలీసులు నిందితుడి వివరాలు ఆనవాళ్లు తెలియజేస్తూ.. ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రివార్డ్ అని ట్వీట్ చేశారు. దీనిపై నాని స్పందిస్తూ.. 'బయటెక్కడో ఉన్నాడు.. వుండకూడదు' అంటూ వైల్డ్ గా రియాక్ట్ అయ్యాడు.  

నిందితుడు ఇంకా బయటే తిరుగుతున్నాడు. అప్రమత్తంగా ఉండండి.. తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి అని దర్శకుడు బాబీ ట్వీట్ చేశారు. 

 

PREV
click me!

Recommended Stories

Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?
Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం