దర్శకుడు క్రిష్ పై గర్జించిన నటసింంహం

Published : Feb 02, 2017, 08:39 AM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
దర్శకుడు క్రిష్ పై గర్జించిన నటసింంహం

సారాంశం

క్రిష్ పై బాలకృష్ణ ఆగ్రహం గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా కలెక్షన్ల వివరాలు బయటపెట్టలేదని మండిపడ్డ బాలయ్య క్రిష్ పై సీరియస్ గానే గర్జించిన  నందమూరి నటసింహం

నందమూరి నటసింహం బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఖైదీ నెంబర్ 150కంటే కేవలం ఒక్క రోజు  ఆలస్యంగా మాత్రమే రిలీాజైంది. కథలో చారిత్రక వాస్తవాలు లేవని ఆరోపణలు వినిపించినా సినిమా పరంగా మాత్రం క్రిష్ దర్శకత్వ నైపుణ్యాన్ని చాటి చెప్పిన సినిమాగా శాతకర్ణి నిలిచింది. అంతేకాక శాతకర్ణి సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది.

 

ఇక సినిమా ప్రారంభమైన మొదట్నుంచి క్రిష్‌ను బాలయ్య, బాలయ్యను క్రిష్ పొగడ్తల వర్షంలో ముంచెత్తారు. ఇక, కేవలం 79 రోజుల్లో ఇలాంటి చారిత్రక కథతో వచ్చిన సినిమాను పూర్తి చేసినందుకు క్రిష్‌కు ప్రశంసలు వెల్లువెత్తాయి.

 

అయితే.. తాజాగా క్రిష్‌పై నటసింహం గర్జించిందట. బాలయ్య దర్శకుడు క్రిష్ పై అసహనం వ్యక్తం చేశాడట. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. ఇప్పటిదాకా చిత్ర బృందం కలెక్షన్ల వివరాలను మాత్రం బయటపెట్టలేదు. అటువైపేమో.. చిరంజీవి 150వ సినిమా ఖైదీ నంబర్ 150 కలెక్షన్లు 100 కోట్ల మార్కును దాటేశాయని.. అల్లు అరవింద్ ప్రకటించేశాడు కూడా. అదే బాలయ్య అసహనానికి కారణమైందట.

చిరంజీవి సినిమా కలెక్షన్ల వివరాలు చెప్పి రేటింగ్స్ కొడుతుంటే... శాతకర్ణి సినిమా కలెక్షన్ల వివరాలను ఎందుకు బయటపెట్టట్లేదని క్రిష్‌ను బాలయ్య ప్రశ్నించాడట. వసూళ్ల లెక్కలను బయటకు చెప్పాలని శాతకర్ణి యూనిట్‌కు బాలయ్య సూచించాడట. అయినా వాటి వివరాలను వెల్లడించకపోవడం బాలయ్యకు ససేమిరా నచ్చలేదట. అందుకే క్రిష్‌పై అసహనాన్ని వ్యక్తం చేశాడట. కాగా, ఇప్పటికే క్రిష్ సహా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్ర నిర్మాతలపై ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

చనిపోయే ముందు శ్రీదేవి నన్ను కలిసింది.. అప్పుడు అందరం కలిసి గెట్ టుగెదర్.!
Ram Charan Peddi Movie: మైండ్ బ్లాక్ అయ్యే సన్నివేశాలతో 'పెద్ది' ఢిల్లీ షెడ్యూల్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే