
1984 లో ప్రచురితమై మూడు దశాబ్దాలకు పైగా పాఠకులను అలరించిన "అతడు అడవిని జయించాడు" అనే నవల ఇప్పుడు సినిమా రూపం దాల్చనుంది.. ప్రముఖ రచయిత డా. కేశవ రెడ్డి గారు రాసిన ఈ నవల ప్రపంచవ్యాప్త సినిమా నిర్మాణ హక్కులను DSN FILMS నిర్మాణ సంస్థ సొంతం చేసుకుంది. అంతర్జాతీయ ఫిలింమేకర్ దూలం సత్యనారాయణ దర్శకత్వం లో పలు చిత్ర నిర్మాణ సంస్థల భాగస్వామ్యం తో ‘‘అతడు అడవిని జయించాడు’’ నవల సినిమా గా రూపొందడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.
‘‘అతడు అడవిని జయించాడు’’ తెలుగు సాహిత్యం లో విశిష్ట రచన.. అంతర్జాతీయ స్థాయి సినిమా గా రూపొందే సత్తా ను ఈ నవల కలిగి ఉందనీ, భారీ బడ్జెట్, అత్యాదునిక టెక్నాలజీ లతో ఆస్కార్ , కాన్స్ , లొకర్నో , బెర్లిన్, టొరంటో , బుసాన్ లాంటి అంతర్జాతీయ సినిమా వేదికల మీద పోటీ పడేలా సినిమా నిర్మాణం ఉంటుందనీ, ఇప్పటికే హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో చర్చలు జరిపినట్టు దర్శకుడు దూలం సత్యనారాయణ తెలిపారు.
దూలం సత్యనారాయణ ఇప్పటివరకు అనేక అంతర్జాతీయ డాక్యుమెంటరీ లను రూపొందించాడు, ఇటీవలే తెలంగాణా టూరిజం ఫిలిం కి పోర్చుగల్ లో ఇంటర్నేషనల్ అవార్డు ని సాధించారు.