
కుర్ర హీరోలకు పోటీగా దూసుకుపోతున్నాడు టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో, గ్లోబల్ లయన్ నందమూరి బాలకృష్ణ. ఆయన హీరోగా.. అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి. ఈ మూవీ అటు ఫ్యాన్స్ తో పాటు..ఇటు ఆడియన్స్ అందరిలో అంచనాలు అమాంతం పెంచేస్తోంది. ముఖ్యంగా ఈసారి బాలయ్య బాబు హ్యాట్రిక్ కొడతాడా లేదా అంటూ ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ గా ఎదుురుచూస్తున్నారు.
ఇక నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ భగవంత్ కేసరి సినిమ నుంచి తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ కి సంబంధించి రెస్పాన్స్ కూడా భారీస్థాయిలో వచ్చింది..ఇంకా వస్తుంది కూడా. ఫ్యాన్స్ నుంచే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. బాలయ్య కెరీర్ లోనే 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన టీజర్ గా ఇది నిలిచింది.
ఈ టీజర్ 24 గంటల్లోనే 12 మిలియన్(1 కోటి 20 లక్షలు) వ్యూస్ తో దూసుకు పోతుంది. ప్రస్తుతం యూ ట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది ఈ టీజర్. ముఖ్యంగా బాలయ్య బాబు ఈటీజర్ లో ఇంత వరకూ ఎప్పుడూ కనిపించనంత కొత్తకా కనిపించాడు. ఆయన డైలాగ్ డెలివరీలో కూడా చాలా మార్పు కనిపించింది. మరీ ముక్యంగా ఆయన చెప్పిన హిందీ డైలాగ్.. ఫ్యాన్స్ ను ఫిదా అయ్యేలా చేసింది. ఈ పేరు చానా రోజులు యాద్ ఉంటది అని బాలయ్య అనగానే ఉత్సాహంతో ఉర్రూతలూగారు అభిమానులు.
ఇక ఈసినిమాలో మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇప్పటి వరకూ సీమ యాసలో డైలాగ్స్ చెప్పిన బాలయ్య బాబు.. ఈ మూవీలో తెలంగాణ యాసలో పవర్ ఫుల్ డైలాగ్స్ ను చెప్పబోతున్నారు. సినిమా ఆసాంతం ఆయన ఎలాంటి డైలాగ్స్ వదులుతారు. ఆయన తెలంగాణ యాస ఎలా ఉండబోతుంది అనేది ఇంట్రెస్టింగ్ గామారింది. కాజల్ అగర్వాల్, శ్రీ లీల లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ పతాకంపై నిర్మిస్తున్నారు.